వైసీపీ నేతల కబ్జాలతో బుడమేరు కనుమరుగయ్యే ప్రమాదం
ABN , First Publish Date - 2023-02-16T01:01:10+05:30 IST
వైసీపీ ప్రభుత్వమొచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు కొలతలే మారిపోయాయని, నాలుగేళ్లల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా
అజిత్‌సింగ్‌నగర్, ఫిబ్రవరి 15: వైసీపీ ప్రభుత్వమొచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు కొలతలే మారిపోయాయని, నాలుగేళ్లల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం ఖాళీ జాగా వేసేయ్ పాగా పేరుతో న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరు ఆక్రమణపై కథనం రావడంతో బుధవారం ఆయన కబ్జా స్థలాన్ని పరి శీలించారు. వైసీపీ నేతల కబ్జాలతో బుడమేరు కనుమరుగయ్యే ప్రమా దం ఉందన్నారు. కబ్జాలు చేసేవారికి అధికారుల అండదండలు పుష్కలం గా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. నాలుగేళ్లల్లో సెంట్రల్ నియో జకవర్గంలోనే పదుల ఎకరాలు కబ్జాలకు గురయ్యాయని, బుడమేరు సన్ సిటీ కాలనీ, న్యూరాజరాజేశ్వరిపేటతో పాటు కండ్రిక, రాజీవ్‌నగర్, రామ కృష్ణాపురం ప్రాంతాల్లో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారని విమర్శిం చారు. బుడమేరు ఆక్రమణల విషయమై ఇరిగేషన్ ఎస్‌ఈతో మాట్లాడా మని, కలెక్టర్‌ను కలవనున్నామని ఉమా తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే బుడమేరు ఆక్రమణలను ప్రక్షాళన చేస్తామని ఆక్రమిత స్థలాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. కబ్జా స్థలాలను వైసీపీ నేతలు అమ్మకానికి పెడుతున్నారని ప్రజలు వాటిని కొని మోసపో వద్దని సూచించారు. టీడీపీ నేతలు ఎరుబోతు రమణ, దాసరి పెప్సీ, గొట్టుముక్కల వెంకీ పాల్గొన్నారు.
కబ్జా స్థలంలో సరిహద్దు రాళ్ల తొలగింపు
ఆంధ్రజ్యోతి కథనానికి కదిలిన టౌన్‌ప్లానింగ్ అధికారులు
న్యూ రాజరాజేశ్వరిపేటలో బుడమేరును ఆక్ర మించి వైసీపీ నేతలు ఆక్రమిత స్ధలంలో వేసిన సరిహద్దు రాళ్లను బుధవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. బుడమేరు కబ్జా అవుతోందంటూ బుధవారం ఆంధ్రజ్యోతిలో ఖాళీ జాగా వేసేయ్ పాగా పేరుతో కథనం ప్రచురితమైంది. స్పందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు కబ్జా స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం బుడమేరులో భాగమేనని ధ్రువీకరించారు.