Vijayawada: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2023-10-19T16:12:58+05:30 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri) లడ్డూ ప్రసాదం (Laddu Prasadam) పోటులో కలెక్టర్ ఢిల్లీరావు (Collector Delhi Rao) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. దుర్గమ్మ (Durgamma)ను దర్శించుకున్న ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం అందించాలనేదే తమ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. శుక్రవారం నుంచి లక్షలాదిగా భక్తులు (Devotees) ఇంద్రకీలాద్రికి తరలివస్తారని అన్నారు. వారికి కోసం నాలుగు లక్షల లడ్డూలు ముందుగానే సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి భక్తునికి అడిగినన్ని లడ్డూలు ఇస్తామన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అదేశించామన్నారు. ఎవరైనా ప్రసాదాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు.