Amaravathi: దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ఆందోళన

ABN , First Publish Date - 2023-04-11T11:53:51+05:30 IST

అమరావతి: ఏపీ (AP)లో ప్రభుత్వ కాంట్రాక్టులు (Government Contracts) చేసిన గుత్తేదారులకు బిల్లులు (Bills) చెల్లించకపోవడంపై ఆందోళన చేపట్టారు.

Amaravathi: దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ఆందోళన

అమరావతి: ఏపీ (AP)లో ప్రభుత్వ కాంట్రాక్టులు (Government Contracts) చేసిన గుత్తేదారులకు బిల్లులు (Bills) చెల్లించకపోవడంపై ఆందోళన చేపట్టారు. మంగళవారం, విజయవాడ, బందర్ రోడ్డులోని ఆర్ అండ్ బి భవనం (R&B building) వద్ద కాంట్రాక్టర్లు (Contractors) ప్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు. బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Building Association of India), స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (State of Andhra Pradesh Building Contractors Association) ఆధ్వర్యంలో ఆందోళన (Protest) చేస్తున్నారు. కాంట్రాక్టర్లు రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను కలిసి బిల్లులు చెల్లించాలంటూ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌ (Pending)లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

‘రక్షించండి.. రక్షించండి.. ఆత్మహత్యల నుంచి కాంట్రాక్టర్లను రక్షించండి... సీనరేజ్, ఇసుక పాలసీలను క్రమబద్ధీకరించండి’ అంటూ కాంట్రాక్టర్లు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. లోప భూయిష్టమైన సిఎఫ్‌ఎంఎస్ ఫేస్ 2 మాడుల్ తక్షణం సరి చేయాలని కోరారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-11T11:53:51+05:30 IST

News Hub