Gadde Rammohan: అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో..?
ABN , First Publish Date - 2023-01-10T15:30:37+05:30 IST
ప్రశ్నించిన మహిళపై దేవినేని అవినాష్ (Devineni Avinash)అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Tdp mla Gadde Rammohan) ఆరోపించారు. కృష్ణలంక

విజయవాడ: ప్రశ్నించిన మహిళపై దేవినేని అవినాష్ (Devineni Avinash)అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Tdp mla Gadde Rammohan) ఆరోపించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబాన్ని గద్దె రామ్మోహన్ పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దాడిలో గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గం. మహిళల కళ్లల్లో కారం కొట్టి అవినాష్ అనుచరులే దాడి చేశారు. ఎమ్మెల్యే కాకుండానే పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అవినాష్ ఇంతలా రౌడీయిజం చేస్తున్నాడు. రేపు పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan), పట్టాబి ఇంటిపై దాడిలోనూ అవినాష్ పాత్రధారి. చిన్న సమస్యపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? జగన్మోహన్ రెడ్డే (Cm jagan) ఈ ఆరాచకాల్ని ప్రోత్సహిస్తున్నారు. అరాచకాలు చేస్తేనే పార్టీలో గుర్తింపు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నేతలకు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ తారకరామ నగర్ 17వ డివిజన్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను మహిళలు నిలదీశారు. సమస్యలపై వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఆ కారణంతోనే మహళలపై దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.