ఘంటసాల చరిత్ర ఎంతో ఘనం : డాక్టర్‌ మాచవరపు

ABN , First Publish Date - 2023-08-07T01:46:20+05:30 IST

ఘంటసాల చరిత్ర ఎంతో ఘనమైనదని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ అన్నారు.

 ఘంటసాల చరిత్ర ఎంతో ఘనం : డాక్టర్‌ మాచవరపు

ఘంటసాల, ఆగస్టు 6 : ఘంటసాల చరిత్ర ఎంతో ఘనమైనదని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత డాక్టర్‌ మాచవరపు ఆదినారాయణ అన్నారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఘంటసాల గ్రామాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. బౌద్ధస్థూపం, బౌద్ధ మ్యూజియం, బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, మన ఘంటసాల డాట్‌ నెట్‌ నిర్వాహకులు రాజేష్‌ వేమూరి ఆయనను సత్కరించి జ్ఞాపికను, ఘంటసాల చరిత్ర పుస్తకాన్ని అందజేశారు.

Updated Date - 2023-08-07T01:46:20+05:30 IST