Gidugu Rudraraju: 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ...

ABN , First Publish Date - 2023-04-14T16:42:05+05:30 IST

విజయవాడ: ఈ నెల 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ (Jai Bharat Satyagraha Public Meeting) జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) చెప్పారు.

Gidugu Rudraraju: 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ...

విజయవాడ: ఈ నెల 24న విజయవాడలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ (Jai Bharat Satyagraha Public Meeting) జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Govt.).. కాంగ్రెస్ ముఖ్యనేత (Congress Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు జై భారత్ సత్యాగ్రహ పోస్టర్‌ను ఆచిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రతిపక్షాలకు రాజ్యాంగం ప్రకారం గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ నెల 24న జరగబోయే సత్యాగ్రహ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని గిడుగు రుద్రరాజు పిలుపిచ్చారు.

కాగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని పరిశ్రమలను కార్పొరేట్లకు అమ్మేసి ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచుకునేందుకు సహకరిస్తోందని, కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే దేశంలోని అన్నివర్గాల ప్రజలు, అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బుధవారం కాకినాడ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జైభారత్‌ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో విపరీతమైన ఆదరణ వస్తోందన్నారు. రాహుల్‌గాంధీ సభలకు ప్రజలు విశేషంగా తరలిరావడంతో బీజేపీ కుట్ర పన్నిందన్నారు. యువనేత, ఎంపీ రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేపట్టి అన్నివర్గాల ప్రజలు, అన్నివర్గాల వారి మద్దతుతో 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు.

కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ గడిచిన పదేళ్ల కాలం నుంచి అధికారానికి దూరంగా ఉన్నా ప్రజల్లో నిత్యం ఉండి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. దూరదృష్టి గల దేశ అభివృద్ధి కోసం పనిచేసే కాంగ్రెస్‌ నాయకులను బీజేపీ ప్రభుత్వం ఇరుకున పెట్టాలనుకోవడం మూర్క త్వమన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఏఐసీసీ సభ్యుడు మల్లిపూడి రాంబాబు, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు, పీసీసీ సభ్యులు కామన ప్రభాకరరావు, ఆకుల వెంకటరమణ, ఓలేటి రాయభాస్కరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కోలా ప్రసాదవర్మ, మారోతి శివగణేష్‌, మేడిద శ్రీనివాస్‌, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ్మనపూడి సత్తప్పనాయుడు, నాయకులు బాబిబోయిన వెంకటేష్‌నాయుడు, తాళ్లూరి రాజు, పిట్టా అర్జున్‌, కంభం రాజబాబు పాల్గొన్నారు. దీక్షకు వామపక్ష నాయకులు తాటిపాక మధు, ఎం.రాజశేఖర్‌, దువ్వా శేషబాబ్జి మద్దతు పలికారు.

Updated Date - 2023-04-14T16:42:05+05:30 IST