Kannababu: లోకేష్, చంద్రబాబులది శాపనార్థాల యాత్ర..

ABN , First Publish Date - 2023-02-17T15:29:33+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి లోకేష్‌ (Lokesh)పై మంత్రి కురసాల కన్నబాబు (Minister Kannababu) విమర్శలు గుప్పించారు.

Kannababu: లోకేష్, చంద్రబాబులది శాపనార్థాల యాత్ర..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి లోకేష్‌ (Lokesh)పై మంత్రి కురసాల కన్నబాబు (Minister Kannababu) విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేష్.. చెరోపక్క బూతుల పురాణం అందుకున్నారని, ఫ్రస్టేషన్‌ (Prestation)లో ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఇద్దరూ శాపనార్థాల యాత్ర చేస్తున్నారని విమర్శించారు. చేసింది చెప్పుకోవడానికి ఏమి లేక సీఎం జగన్‌ (CM Jagan)ను భూతులు తిడుతున్నారని అన్నారు.

టీడీపీ (TDP) అధికారంలో ఉండగా కరువు విలయతాండవం చేసిందని, చంద్రబాబు పాలనలో కరువు వచ్చిందంటే దరిద్రం అంటారా? అనరా? అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పాదం ఎక్కడ మోపితే అక్కడ కష్టం, కన్నీరేనని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఏపీకి ప్రవాసాంధ్రులని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబును ఏపీకి వచ్చి ఉండమంటున్నారని అన్నారు. లోకేష్‌కు నాలుగు బూతులు నేర్పి పంపించారన్నారు. పశు ప్రవృత్తి కలిగిన నేతలంతా టీడీపీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.

లోకేష్‌ను ముందు టెన్త్ (10th) పరీక్ష రాసి పాస్ అవ్వమని చెప్పాలని కన్నబాబు సూచించారు. పవర్ సైకో (Power Psycho) ఎవరైనా ఉన్నారా? అంటే అది చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు, లోకేష్ క్షమాపణ యాత్ర చేయాలన్నారు. రాజధానిపై ప్రభుత్వానికి కన్ఫ్యూజన్ (Confusion) లేదని, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టి చంద్రబాబు సాధికార సారథులు అంటున్నారని, వైస్సార్ విగ్రహాలను టచ్ చేసి చూస్తే చింతమనేని ప్రభాకర్‌కు అప్పుడు తెలుస్తుందని మంత్రి కన్నబాబు అన్నారు.

Updated Date - 2023-02-17T15:29:36+05:30 IST