Speaker Tammineni: టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం...

ABN , First Publish Date - 2023-03-20T12:54:25+05:30 IST

పార్లమెంటు (Parliament) నుంచి వచ్చిన సభా సంప్రదాయాలనే ఏపీ శాసనసభ (AP Assembly) అనుసరిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) పేర్కొన్నారు.

Speaker Tammineni: టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం...

అమరావతి: పార్లమెంటు (Parliament) నుంచి వచ్చిన సభా సంప్రదాయాలనే ఏపీ శాసనసభ (AP Assembly) అనుసరిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) పేర్కొన్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీలో టీడీపీ (TDP) ఎమ్మెల్యేపై దాడి ఘటనపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని అన్నారు. కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా తాను వాటిని పూవులుగానే భావించానని, తానేమి గౌతమ బుద్ధుడిని కాదని అన్నారు.

శ్రీరామ చంద్రుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సభలో ఉన్నారని, రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసునని తమ్మినేని సీతారాం అన్నారు. టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని, సభకు, సభాపతి స్థానానికి గౌరవం లేకుండా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ సభ్యులు నిరసన తెలియచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ సభ్యుల ప్రవర్తన గర్హనీయం, ఆక్షేపణీయమని అన్నారు. సభ్యులు పోడియం వద్ద, సభాపతి స్థానం వద్దకు వచ్చి ఆటంక పరిస్తే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ అయ్యేలా రూలింగ్ ఉందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

కాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) టీజేఆర్ సుధాకర్ బాబు (Sudhakar Babu) దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampally Srinivas) టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudhary) దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కింద కూర్చోని నిరసన చేపట్టారు. జీవో నంబర్1రద్దు చేయాలంటు టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో స్పీకర్ చైర్ దగ్గరకు వెళ్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-20T12:54:25+05:30 IST