రోడ్ల దుస్థితి పట్టని ఎమ్మెల్యే అనిల్‌కుమార్
ABN , First Publish Date - 2023-06-17T01:52:10+05:30 IST
రోడ్లు గోతులతో అధ్వానంగా మారి ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఎమ్మె ల్యే అనిల్‌కుమార్ పట్టించుకోవడం లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ధ్వజమెత్తారు.

కృష్ణాపురం(పమిడిముక్కల), జూన్ 16 : రోడ్లు గోతులతో అధ్వానంగా మారి ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఎమ్మె ల్యే అనిల్‌కుమార్ పట్టించుకోవడం లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై టీడీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆయన నిరసన తెలిపారు. కుమార్ రాజా మాట్లాడుతూ, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అవినీతికి అం తం లేకుండా పోయిందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లను బెదిరించడంతో అర్ధాంతరంగా రోడ్ల పనులు ఆపివేయడం సిగ్గుచే టన్నా రు. కృష్ణాపురం - పమిడిముక్కల, ఐలూరు - కూచిపూడి-మొవ్వ రోడ్లు పెద్ద గోతులతో ద్విచక్రవాహనాలు కూడా నడిపేందుకు వీలులేకుండా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. 15 రోజుల్లో రోడ్డుపనులు పునఃప్రారంభించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని కుమార్‌రాజా హెచ్చరించారు. మో టూరు వెంకటసుబ్బయ్య, బాబూరావు, జక్కా శ్రీనివాసరావు, మండలపార్టీ అధ్యక్షుడు రాజులపాటి శ్రీనివాసరావు, చాట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.