AP NEWS: మహానందిలో ఎలుగుబంటి కలకలం.. భయంలో భక్తులు
ABN , First Publish Date - 2023-09-18T23:06:04+05:30 IST
జిల్లాలోని మహానంది(Mahanandi) క్షేత్ర శివారులో మరోసారి ఎలుగుబంటి( Bear) కలకలం సృష్టించింది. రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.
నంద్యాల: జిల్లాలోని మహానంది(Mahanandi) క్షేత్ర శివారులో మరోసారి ఎలుగుబంటి( Bear) కలకలం సృష్టించింది. రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దాని బారీ నుంచి తప్పించుకునేందుకు కేకలు వేశారు. దీంతో స్థానికులు రాళ్లు విసరడంతో ఎలుగు బంటి అటవీలోకి వెళ్లింది. అక్కడున్న వారు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎలుగుబంటిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగుబంటి వల్ల ఇళ్లలోనుంచి భయటకు రావాలన్న ఎక్కడ దాడి చేస్తోందోనని భయం వేస్తోందని స్థానికులు అంటున్నారు. కాగా.. గత 13 రోజుల క్రితం మహానంది క్షేత్ర పరిధిలో ఎలుగు బంటిని అధికారులు బంధించి అడవిలో వదిలారు. గతంలో కూడా వారం రోజుల పాటు మహానంది ప్రజలకు ఎలుగుబంటి నిద్రలేకుండా చేసింది. ఎలుగుబంటి నుంచి ఎలాంటి ప్రమాదం, ప్రాణహాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు(Forest officials) రక్షణ కల్పించాలనిభక్తులు, స్థానికులు కోరుతున్నారు.