Ambati Rambabu: ‘బ్రో’ సినిమాలో డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారో తెలుసా..

ABN , First Publish Date - 2023-07-29T15:14:31+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలను తిట్టిపోస్తున్నారు.

Ambati Rambabu: ‘బ్రో’ సినిమాలో డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారో తెలుసా..

విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధర్ తేజ్ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాపై (BRO Movie) పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలను తిట్టిపోస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మంత్రి అంబటి రాంబాబు స్పందించి పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నానని.. కానీ చూడలేదన్నారు. శునకానందం పోందే పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు చాలా చూశానని.. తాను పెద్ద సినిమా పిచ్చోడినని అన్నారు. అలాగే ఒక సినిమాలో నటించారు కదా అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు...‘‘నేను పూర్తిగా నటిస్తే వారు కంగారు పడతారు’’ అంటూ అంబటి రాంబాబు వెరైటీగా సమాధానం ఇచ్చారు.

పవన్‌పై అంబటి వ్యాఖ్యలు ఇవే...

‘‘పవన్ కళ్యాణ్‌ ప్రముఖ సినీ నటులు... నా క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నా.. నేను చూడలేదు. నామీద కోపం ఉంటే రాజకీయంగా చెయ్యి. నన్ను ఎదుర్కోలేకపోతున్నావు. నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బు ఖర్చు చేస్తే అక్కడ నా క్యారెక్టర్ పెట్టి ఆనందపడుతున్నావు. ఆ క్యారెక్టర్‌కు శ్యాంబాబు అని పేరుపెట్టి దాన్ని తిట్టి ఆనందపడుతున్నావు. అలా పడే ఆనందాన్ని శునకానందం అంటారు. శునకానందం పోందే పరిస్ధితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు. ఎవరో డబ్బులు ఇస్తే, ప్యాకేజీ తీసుకుని నేను డ్యాన్స్ చెయ్యను, అసెంబ్లీకి వస్తూ డ్యాన్స్ చేయను. అవును నేను సంక్రాంతికి ముగ్గులు పోటీ పెట్టి డ్యాన్స్ చేశాను దాన్ని డ్యాన్స్ అనడం కంటే ఆనంద తాండవం అనాలి. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్‌ను కామెంట్ చేస్తావా. నేను వేసిన డ్యాన్స్ గెలిచి వేసిన సంక్రాంతి డ్యాన్స్.. నువ్వు ఓడి వేసిన డ్యాన్స్, చీకటి డ్యాన్స్. నాపేరు సినిమాలో పెట్టుకో శ్యాంబాబు అని ఎందుకు రాంబాబు అని పెట్టుకో. నేను తెరమీదే ఉండాలి నెగిటివ్‌గా అయినా పాజిటివ్‌గా అయినా. మా అన్న సినిమా యాక్టర్ అయితే నేను సినిమా యాక్టర్ కాలేదు... మానాన్న ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాలేదు. ఈసారి మరలా భోగి పండగ రోజు డ్యాన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి చూసుకో. నా డ్యాన్స్ సింక్ అవుతుందో లేదో ప్రజలు చూస్తారు. అసలు నువ్వు సింక్ అవుతావో లేదో చూసుకో. నన్ను తిట్టాలనుకుంటే అది నాకు ప్లస్ కానవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకు చూడము..చూస్తాము ఇప్పుడు చూస్తే ఇప్పుడే వెళ్లానని రాస్తారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు చాలా చూసా నేను పెద్ద సినిమా పిచ్చోడిని’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-29T15:31:12+05:30 IST