Vallabhaneni Vamsi : ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది..’ అర్ధరాత్రి హైవేపై వంశీ ఫ్యాన్స్ హంగామా!
ABN , First Publish Date - 2023-10-21T08:33:41+05:30 IST
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) పుట్టిన రోజు (Birth Day) కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు నానా హంగామా చేశారు. జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు...
ఎన్టీఆర్ జిల్లా : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) పుట్టిన రోజు (Birth Day) కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు నానా హంగామా చేశారు. జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. వంశీ కార్యాలయం ఎదుటే నేషనల్ హైవే (National High Way) ఉంటుంది. దీంతో రహదారిపై టేబుల్ పెట్టి కేక్ కటింగ్ చేసి.. బాణ సంచాలు కాలుస్తూ రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను సైతం అడ్డుకుని వంశీ అనుచరులు (Vamsi Followers) రచ్చ రచ్చ చేశారు. ఈ బాణ సంచా థాటికి దట్టమైన పొగతో గన్నవరం జాతీయ రహదారి నిండిపోయింది. అయితే హైవేపై ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ‘ మాకేమీ తెలియదు.. మాకెందుకులే’ అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. కాగా.. ఎమ్మెల్యే వంశీ కార్యాలయానికి (Vamsi Office) అతి సమీపంలోనే డీఎస్పీ కార్యాలయం (DSP Office) ఉన్నప్పటికీ ఇలా జరగడం ఎలా అర్థం చేసుకోవాలో మరి.
ఆపేదెవరు.. టచ్ చేసేదెవరు..?
వంశీ ఫ్యాన్స్, అనుచరులు (Vamsi Fans, Followers) రాత్రంతా చేసిన రచ్చకు హైవేపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు గంట పాటు వాహనాలు నిలిపివేశారు. బైకులతో వంశీ ఫాలోవర్స్ రోడ్డుపైనే డాన్సులు చేశారు. ‘మమ్మలిని ఎవడ్రా రా ఆపేది’, ‘టచ్ చేసి చూడండి’ అంటూ రహదారిపైనే పుట్టిన రోజు వేడుకలు, డ్యాన్స్‌లతో హడావుడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు సైలెంట్‌గా ఉండటంతో ఇక తాము చేసేదేంటి..? ఆ యువకులను ప్రశ్నించలేక వాహనదారులు అంతా క్లియర్ అయ్యాకే అక్కడ్నుంచి వాహనాలు కదిలించారు. కొందరైతే బిక్కు బిక్కుమంటూ ఎమ్మెల్యే కార్యాలయం దాటేందుకు ప్రయత్నించిన పరిస్థితి. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ రహదారిపై ఈ రచ్చ కొనసాగింది. వంశీ అనుచరులు, ఫ్యాన్స్ ఓవరాక్షన్‌తో వాహనదారులు, సామాన్య ప్రజలు విస్తుపోయారు. కనీసం పోలీసులు పట్టించుకోకపోవడంపైనా జనాలు కన్నెర్రజేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇటు వంశీ.. అటు పోలీసుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.