Nellore Dist.: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు..
ABN , First Publish Date - 2023-11-21T08:49:00+05:30 IST
నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, జనసమీకరణ, హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు తెలియవచ్చింది.
నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (Rains), జనసమీకరణ, హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కారణంగా సీఎం పర్యటన రద్దయినట్లు తెలియవచ్చింది. అంచనాలు, అనుమతులు, టెండర్లు లేకుండానే సుమారు రూ.150 కోట్ల పనులకు ముఖ్యమంత్రితో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అంచనా వ్యవయం పెంచినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. పులికాట్ మత్స్యకార ఓటర్లకు వలవేసేందుకే సీఎం పర్యటన అంటూ చర్చలు జరిగాయి.
అయితే సీఎం జగన్ పర్యటన రద్దు కావడంతో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు ఢీలాపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దుతో ఇప్పటికే ఖర్చు చేసిన పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు వృధా అయ్యాయి. కాగా జగన్ పాదయాత్ర (Padayatra) సమయంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పులికాట్ పూడిక తీయిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పులికాట్ పూడికతీతకు సర్వే చేయించిన గత టీడీపీ ప్రభుత్వం (TDP Govt.) రూ. 48 కోట్లు కేటాయించింది.