Nimmala Ramanayudu : బీసీల ద్రోహి జగన్.. 26 వేల మందిపై అక్రమ కేసులు
ABN , First Publish Date - 2023-05-29T13:47:11+05:30 IST
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పీపుల్స్ మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేష సానుకూల స్పందన లభిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని సంక్షేమం పథకాలు అందిస్తూ వారు మరింత సాధికారత సాధించడానికి అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టారన్నారు.
ఏలూరు : మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పీపుల్స్ మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేష సానుకూల స్పందన లభిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని సంక్షేమం పథకాలు అందిస్తూ వారు మరింత సాధికారత సాధించడానికి అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టారన్నారు. ప్రతీ మహిళకు జిల్లా పరిధిలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తారన్నారు. రానున్న చంద్రబాబు పాలనలో మహిళల భవితకు భరోసా అందిస్తారన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే నిరుద్యోగులకు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. బీసీల ద్రోహి జగన్ అని.. నాలుగేళ్లలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని.. వారి కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. రాష్ట్రం అప్పుల మయం అవుతోందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.