పోలీసుల సమక్షంలో వైసీపీ జెండా దిమ్మె నిర్మాణం
ABN , First Publish Date - 2023-11-22T23:13:34+05:30 IST
అధికారం మనదైనప్పుడు మమ్మల్ని ఆపేదెవరు అంటూ అధికార వైసీపీ నాయకులు వ్యవహరించారు. పోలీసుల పహారా నడుమ వైసీపీ జెండా దిమ్మెను కట్టించిన సంఘటన మండలంలోని పడమటకట్టకిందపల్లిలో బుధవారం జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గట్ల కొండారెడ్డి ఖండించారు.

అభ్యంతరం తెలిపిన టీడీపీ గ్రామ కమిటి
పామూరు, నవంబరు 22 : అధికారం మనదైనప్పుడు మమ్మల్ని ఆపేదెవరు అంటూ అధికార వైసీపీ నాయకులు వ్యవహరించారు. పోలీసుల పహారా నడుమ వైసీపీ జెండా దిమ్మెను కట్టించిన సంఘటన మండలంలోని పడమటకట్టకిందపల్లిలో బుధవారం జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గట్ల కొండారెడ్డి ఖండించారు. పది మంది కూర్చోడానికి ఉపయోగపడే చౌక్ వద్ద ముందు భాగంలో వైసీపీ జెండా దిమ్మెను నిర్మించవద్దని పలువురు గ్రామస్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఊరుమ్మడి ప్రయోజనాలకు విరుద్ధంగా రోడ్డుపై జండా దిమ్మె కడుతుంటే అందుకు పోలీసులు సహకరించడం ఎంతవరకు సమంజసమని కొండారెడ్డి ప్రశ్నించారు.