ACB COURT: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వాదనలు.. సీఐడీ లాయర్‌ను ప్రశ్నించిన జడ్జి

ABN , First Publish Date - 2023-10-11T19:50:15+05:30 IST

ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో (ACB COURT) పీటీ వారెంట్‌పై ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.

ACB COURT: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వాదనలు.. సీఐడీ లాయర్‌ను ప్రశ్నించిన జడ్జి

విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో (ACB COURT) పీటీ వారెంట్‌పై ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.

"ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నిందితుడని, కార్పోరేషన్ చైర్మన్‌గా వేమూరి హరి ప్రసాద్ ను నియమించాలని చంద్రబాబు అధికారులకు లేఖ రాశారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాకా నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టారు. 2015లోనే గత ప్రభుత్వం టెరాసాఫ్టును ఏడాది పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. దురుద్దేశ పూర్వకంగా బ్లాక్ లిస్ట్ నుంచి టేరాసాఫ్ట్‌ను తొలగించారు. టేరాసాఫ్ట్ కోసమే apts అనే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఫైబర్ నెట్ కేసులో రూ. 114.53 కోట్లు మేర అవకతవకలు జరిగాయి అని తేలింది." అని ప్రభుత్వ న్యాయవాది వై‌ఎన్ వివేకానంద కోర్టులో వాదించారు.

ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగాయి. సీఐడీ న్యాయవాదికి న్యాయమూర్తి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక కేసులో నిందితులుగా చేర్చిన వారినందరిని అరెస్ట్ చేయాలని ఎక్కడ ఉందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ న్యాయవాది వివేకానందను న్యాయమూర్తి ఈ మేరకు ప్రశ్నించారు.

Updated Date - 2023-10-11T19:51:45+05:30 IST