Rain: తిరుమలలో వర్షం
ABN , First Publish Date - 2023-05-03T21:48:46+05:30 IST
తిరుమల (Tirumala)లో బుధవారం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు వర్షం
తిరుమల: తిరుమల (Tirumala)లో బుధవారం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు వర్షం (Rains) జోరుగా కురిసింది. దాంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే వారితోపాటు దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చినవారు కూడా తడిచారు. వర్షం కురిసింది గంటే అయినా తిరుమల మొత్తం జలమయమైంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు తడిచిముద్దయ్యాయి. హఠాత్తుగా కురిసిన వర్షానికి భక్తులు (Devotees) ఇబ్బంది పడ్డారు. వర్షం ఆగాక తిరుమల కొండ చల్లబడింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతోపాటు దర్శనం తర్వాత వెలుపలకు వచ్చే భక్తులు వర్షంతో తడుస్తూ వెళ్లారు. కొంతమంది వర్షం నిలిచేవరకు షెడ్ల కింద సేదతీరారు. రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఘాట్లలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.