14 రోజులుగా తాగునీరు బంద్‌

ABN , First Publish Date - 2023-01-31T00:01:21+05:30 IST

మేజరు పంచాయతీ పొందూరులో తాగునీటికి కట కటలాడుతున్నారు. వీధుల్లో కొళాయిలు పుష్కలంగా ఉన్నా 14 రోజు లుగా తాగునీటి సరఫరా లేదు.

14 రోజులుగా తాగునీరు బంద్‌
నీరురాని వీధి కొళాయిలు

- పైపులైనుల మరమ్మతులతో ఇబ్బంది

- పట్టించుకోని పంచాయతీ అధికారులు

పొందూరు: మేజరు పంచాయతీ పొందూరులో తాగునీటికి కట కటలాడుతున్నారు. వీధుల్లో కొళాయిలు పుష్కలంగా ఉన్నా 14 రోజు లుగా తాగునీటి సరఫరా లేదు. మరమ్మతులు పేరుతో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నా రు. తాగునీటికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైదాం రెల్లిగెడ్డలో నిర్మించిన బోరు నుంచి పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. పైపులైన్లు రైల్వే పట్టాల కింద నుంచి వెళ్తున్నాయి. దీంతో ఇక్కడ తరచూ మరమ్మతులకు గురవుతోంది. శాశ్వత పరిష్కారం చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఎప్పటికప్పుడు నీటి కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. గత రెండు వారాలుగా కొళాయిల ద్వారా తాగునీటి రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులు చేస్తాం

పైపులైన్లు మరమ్మతులకు గురవ్వడంతో గత రెండు వారాలుగా తాగునీరు సరఫరా చేయలేకపోతున్నాం. తాగునీటి సరఫరా పునరు ద్ధరణకు అవసరమైన చర్యలుతీ తీసుకుంటున్నాం.

- ఎస్‌.రమేష్‌, ఈవో పొందూరు

Updated Date - 2023-01-31T00:01:23+05:30 IST