21న కళింగపట్నం బీచ్ క్లీనింగ్
ABN , First Publish Date - 2023-05-16T23:28:33+05:30 IST
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు పునరంకితం కావాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలో మిషన్ లైఫ్(లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్మెంట్) కార్యక్రమం నిర్వహించారు.

- కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
శ్రీకాకుళం, మే 16(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రజలు పునరంకితం కావాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలో మిషన్ లైఫ్(లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్మెంట్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు అధికారులు, పర్యావరణ ప్రేమికులు డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై జూన్ 5 వరకు పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అందరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రకృతితో మమేకమయ్యేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ నెల 21న కళింగపట్నం బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు తోడ్పాటు నిద్దామని అధికారులు, పర్యావరణ ప్రేమికులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకర్‌నాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, జిల్లా చీఫ్‌కోచ్ మాధురీలత, సెట్‌శ్రీ సీఈవో ప్రసాద్‌రావు పాల్గొన్నారు.