Chandrababu: అయ్యన్నతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-09-01T13:50:40+05:30 IST
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో సంభాషించారు.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో (TDP Leader Ayyannapatrudu) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ఫోన్‌లో సంభాషించారు. సీనియర్ నేత అయ్యన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అరెస్ట్, కేసులతో అయ్యన్న గొంతు నొక్కాలి అని చూస్తున్నారన్నారు. తాను దైర్యంగా ఉన్నానని.. జగన్‌ను, అసమర్థ ప్రభుత్వాన్ని వదిలేది లేదని అయ్యన్న చెప్పారు. ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు నాయుడుకు అయ్యన్న ధన్యవాదాలు తెలిపారు.
కాగా.. విశాఖలో అరెస్ట్ చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అనకాపల్లిలో పోలీసులు విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం ఎలమంచిలి మధ్య హైవేపై అయ్యన్నకు 41(ఏ) నోటీసు ఇచ్చి మరి విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేశారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు మోహరించారు. దీంతో ముందుగానే అయ్యన్నను పోలీసులు విడిచిపెట్టారు.