AP Govt: సలహాదారుల నియామకంపై దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-03-21T21:20:34+05:30 IST
జగన్ (Jagan) ప్రభుత్వంలో సలహాదారుల నియామకానికి అడ్డూఅదుపూ లేదు. వారి అర్హతలతో సంబంధం లేదు. కేవలం పునరావాసం కల్పించడం...

అమరావతి: జగన్ (Jagan) ప్రభుత్వంలో సలహాదారుల నియామకానికి అడ్డూఅదుపూ లేదు. వారి అర్హతలతో సంబంధం లేదు. కేవలం పునరావాసం కల్పించడం, ప్రజల డబ్బులను జీతాలుగా ఇచ్చి పార్టీ పనులు చేయించుకోవడం... ఈ రెండు లక్ష్యాలతో లెక్కలేనంత మందిని సలహాదారులుగా నియమించారు. ఆ శాఖ, ఈ శాఖ, ఆ విభాగం, ఈ విభాగం అన్నతేడా లేకుండా అన్నిచోట్లా సలహాదారులను నింపేశారు. 3 లక్షల రూపాయలపైనే జీతం, ప్రభుత్వ వాహనం, ఇతర అలవెన్సులు కల్పించారు. 13 మందికిపైగా సలహాదారులకు కేబినెట్ ర్యాంకు ఇచ్చేశారు. హైకోర్టు మొట్టికాయలు, విపక్షాల విమర్శల నేపథ్యంలో వైసీపీ సర్కార్ (YCP Govt) దిగివచ్చింది. సలహాదారుల నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సలహాదారుల నియామకం విషయంలో విధానం రూపొందిస్తున్నామని, కేబినెట్ ఆమోదం తరువాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
ఒకరూ ఇద్దరూ కాదు... వంద మందికిపైగా సలహాదారులు. వారు ఇచ్చిన సలహాలేమిటో, వాటివల్ల ప్రజలకు ఏం ఒరిగిందో, అసలు వాళ్లు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో... అంతా ఓ మాయ. లక్షలకు లక్షలు జీతాలు, వసతులు, ప్రొటోకాల్ ఆర్భాటాలు. చివరికి... హైకోర్టు తీవ్రంగా స్పందించే స్థాయిలో విచ్చలవిడిగా సలహాదారులను ప్రభుత్వం నియమించింది. గతంలో సలహాదారుల నియామకం విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐఏఎస్ (IAS) అధికార్లు ఉండగా.. వివిధ శాఖలకు సలహాదార్లు ఎందుకని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పేర్కొంది. సలహాదారుల పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. దేవాదాయశాఖకు సలహాదారుగా నియమితులైన శ్రీకాంత్‌పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులు సవరించింది. సలహాదారుగా కొనసాగేందుకు శ్రీకాంత్‌కు హైకోర్టు అనుమతిచ్చింది.
అనేక మందిలో కొందరు...
జగన్ సర్కారు వందిమందికిపైగా సలహాదారులను నియమించింది. వారి జాబితా ఎక్కడా అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న జీవోలో, గెజిట్‌ల ఆధారంగా పరిశీలించి రూపొందించిన జాబితా ఇది...
1 శ్రీనాథ్ దేవిరెడ్డి ఐటీ, (టెక్నికల్)-కేబినెట్ ర్యాంకు
2 జె. విద్యాసాగర్‌రెడ్డి, ఐటీ (టెక్నికల్)
3 కె. రాజశేఖరరెడ్డి, ఐటీ (పాలసీ)
4 బీఎస్‌ఎస్‌రెడ్డి, నీటి పారుదల శాఖ(మంత్రికి)
5 ఎన్. గోవిందరెడ్డి నీటి వనరుల శాఖ (కమిషనర్‌కు)
6 వి.ఎన్. భరత్‌రెడ్డి, ఏవియేషన్
7 తుమ్మల లోకేశ్వరరెడ్డి, టెక్నికల్ ప్రాజెక్టులు
8 అజేయకల్లం రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు
9 ఎస్.ఆర్.వీరారెడ్డి, ఇండస్ట్రియల్ ప్రమోషన్
10 సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రజావ్యవహారాలు
11 కె. రామచంద్రమూర్తి, పబ్లిక్‌పాలసీ (రాజీనామా చేశారు)
12 సాగి దుర్గాప్రసాదరాజు ప్రభుత్వ కో-ఆర్డినేషన్
13 పీటర్ డి. హాసన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ (మరియు విదేశీ సంబంధాలు)
14 దేవులపల్లి అమర్, మీడియా, ఇంటర్‌స్టేట్ అఫైర్స్
15 కృష్ణ జి.వి.గిరి, ఇండస్ట్రియల్ ప్రమోషన్
16 డాక్టర్. నోరి దత్తాత్రేయుడు, వైద్యరంగం
17 ఆర్. కొండలరావు, పంచాయతీరాజ్
18 అకునూరి మురళి, పాఠశాల విద్య మౌలికసదుపాయాలు
19 ఎం.వెంకటేశ్వరరావు, నీటి వనరులు
20 ఎస్.పి. రామకృష్ణమూర్తి, అంత:రాష్ట్ర నీటివనరులు
21 టి. విజయకుమార్, రైతు సాధికార సంస్థ
22 సుభాష్ చంద్రగార్గ్, ముఖ్యమంత్రికి (రిసోర్స్ మొబిలైజేషన్)
23 గోవింద హరి, ఆరోగ్యశ్రీ
24 శ్రీధర్ లంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వేస్ట్‌మెంట్
25 జుల్ఫీ మిడిల్, ఈస్ట్ దేశాల ప్రత్యేక ప్రతినిధి
26 మేడపాటి ఎస్. వెంకట్, నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్
27 శిల్పా చేకుపల్లి, హెల్త్ అడ్వయిజర్ (ఢిల్లీ)
28 ఎం. శామ్యూల్, ముఖ్యమంత్రి సలహాదారు
29 జివిడి కృష్ణమోహన్, కమ్యూనికేషన్స్
30 పి. శరత్‌కుమార్, అవినీతి నిరోధక శాఖ
31 డాక్టర్ వెంకట్ చెంగవల్లి, 108,104 సేవలు
32 పి.వి.రమణరాయలు, డీజీపీ చీఫ్ లీగల్ సేవలు
33 ఎం. నాగరఘు, డీజీపీ చీఫ్ లీగల్ సేవలు
34 ఎం.ఆర్. శరవణ కుమార్, సీఐడీ చీఫ్ లీగల్ సేవలు
34 ఎస్. రాజీవ్‌కృష్ణ, ఇండస్ట్రియల్ ప్రమోషన్
35 పెద్దమల్లు చంద్రహాసరెడ్డి, నాన్-రెసిడెంట్ తెలుగు అఫైర్స్ డిప్యూటీ సలహాదారు
36 ఇనకొల్లు వెంకటేశ్వర్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చీఫ్ లీగల్ సేవలు
37 డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్
38 ఆర్. ధనుంజయ్‌రెడ్డి విలేజ్, వార్డు సెక్రెటరీస్, స్పందన, సీఎంకు సలహాదారు
39 వి. సునీల్‌కుమార్‌రెడ్డి ఏపీఐటీఏ స్ట్రాటజిక్ అడ్వైజర్
40 ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, అగ్రికల్చర్ మిషన్
41 అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, నవరత్నాలు, వైస్ చైర్మన్
42 చల్లా మధుసూదన్ రెడ్డి, స్కిల్ డెవల్‌పమెంట్ ట్రైనింగ్
43 ఎం. జ్ఞానేందర్‌రెడ్డి, పెట్టుబడులు
44 వాసుదేవరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ, వైద్యరంగం