తప్పని డోలీ మోత
ABN , First Publish Date - 2023-05-07T00:56:05+05:30 IST
ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మారుమూల ప్రాంత వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు.
పిడుగుపాటు బాధితుల తరలింపులో కష్టాలు
పాడేరు, మే 6 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మారుమూల ప్రాంత వాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. మండలంలో శనివారం బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో మాదెల పెద్దమ్మికి తీవ్రంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే వల్లాయి గ్రామం నుంచి బడిమెల వరకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంలో సుమారు మూడు కిలోమీటర్ల ఆమెను డోలీలో బడిమెల మోసుకుని వచ్చారు. అక్కడి నుంచి మరో వాహనంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. తమ ప్రాంతానికి సంపూర్ణ రోడ్డు సదుపాయం లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ సోమెలి లక్ష్మణరావు, పెద్దమ్మి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు.