ఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక

ABN , First Publish Date - 2023-02-04T01:17:43+05:30 IST

ఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక

ఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవలక్ష్మి   ఏకగ్రీవంగా ఎన్నిక
ఎంపీపీగా బాధ్యతులు స్వీకరిస్తున్న కోన లోవలక్ష్మి

ముందే వెల్లడించిన ‘ఆంధ్రజ్యోతి’

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 3: మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా పెనుగొల్లు ఎంపీటీసీ సభ్యురాలు కోన లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె చేత ఎన్నికల అధికారి బి.లక్ష్మీపతి ప్రమాణస్వీకారం చేయించారు. ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే చెప్పినట్టు లోవలక్ష్మికే ఎంపీపీ పదవి దక్కింది.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీపీగా గెలిచిన బొలిశెట్టి శారదాకుమారి ఐదు నెలల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసింది. దీంతో ఖాళీ అయిన ఎంపీపీ పదవికి శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.లక్ష్మీపతి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. వైసీపీకి చెందిన 15 మందితోపాటు జనసేనకు చెందిన ఒక సభ్యుడు హాజరయ్యారు. టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు రాలేదు. ఎన్నికల అధికారి లక్ష్మీపతి ఎన్నికల ప్రక్రియ చేపట్టగా వైసీపీ నుంచి కోన లోవలక్ష్మి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ విప్‌ ప్రకటించారు. ఆమె పేరును మాజీ ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి ప్రతిపాదించగా, మరో సభ్యుడు బైపా శ్రీనివాసరావు బలపరిచారు. మరెవరూ పోటీలో లేకపోవడంతో ఎంపీపీగా లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. నూతన ఎంపీపీని సభ్యులంతా అభినందించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గం పరిశీలకుడు చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఎంపీడీవో ఎన్‌వీ రామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T01:17:54+05:30 IST