Merugu Nagarjuna: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ రెడీ
ABN , First Publish Date - 2023-01-05T14:52:01+05:30 IST
ఎన్నికలు (Elections) ఎప్పుడొచ్చినా వైసీపీ (ycp) సిద్ధంగా ఉంటుందని మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) వ్యాఖ్యానించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘కందుకూరు
విశాఖ: ఎన్నికలు (Elections) ఎప్పుడొచ్చినా వైసీపీ (ycp) సిద్ధంగా ఉంటుందని మంత్రి మేరుగు నాగార్జున (Merugu Nagarjuna) వ్యాఖ్యానించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘కందుకూరు (Kandukuru), గుంటూరులో జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చింది. ఈ జీవో చంద్రబాబు (Chandrababu) కోసం తెచ్చింది కాదు.. సీఎం జగన్(Cm jagan)తో సహా అందరూ కోసం తెచ్చిన జీవో ఇది. అయినా ఈ జోవో వచ్చాక జగన్ రోడ్ షో (Jagan Road Show) చేయలేదు.. రోడ్డు మీద వెళ్లారు.. ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను మేము ఆపం. కానీ దళితులపై చంద్రబాబు వ్యవహరించిన తీరును వారి తండ్రికి చెప్పమని లోకేష్‌కి గుర్తు చేస్తాం. కమ్యూనిస్టులు పేదల కోసం పని చేయడం లేదు. చంద్రబాబు కోసం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు.. జగన్ రథయాత్ర చక్రాల కింద నలగాల్సిందే. త్వరలోనే విశాఖ కేంద్రం (Visakhapatnam)గా పరిపాలన.. అయితే కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాం.’’ అని మంత్రి నాగార్జున గుర్తుచేశారు.