వ్యవసాయాన్ని పండగ చేస్తాం
ABN , First Publish Date - 2023-05-30T01:06:48+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండగ చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.

అనకాపల్లి టౌన్, మే 29 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండగ చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి మేనిఫెస్టోలో అన్ని వర్గాల అభివృద్ధి పొందుపరిచారన్నారు. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధిని చేయడమే లక్ష్యమన్నారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకువస్తానని చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ప్రతి ఆడబిడ్డ 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వారికి ప్రతి నెలా రూ.1500 ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మహాశక్తి పథకాన్ని చంద్రబాబు అందుబాటులోకి తేనున్నారన్నారు. చంద్రబాబు మహిళా పక్షపాతి అని రుజువు అయిందన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్యాలయాన్ని ప్రస్తుత పాలకులు సర్వనాశనం చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూతపడిన అన్న క్యాంటీన్లు తిరిగి తెరిపిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, మళ్ల సురేంద్ర, బొద్దపు ప్రసాద్, సబ్బవరపు గణేష్, పోలారపు త్రినాథ్, దాడి జగన్, కశిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.