రైతు సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
ABN , First Publish Date - 2023-06-06T00:44:41+05:30 IST
రైతు సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.

ఎలమంచిలి, జూన్ 5: రైతు సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మునిసిపాలిటీలోని 22వ వార్డు కొక్కిరాపల్లి సమీపంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా ప్రగడ నాగేశ్వరరావు, పరిశీలకులు బొండా జగన్ దుక్కి దున్నారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ.. పంటలు బాగా పండి రైతన్నలు సుభిక్షంగా ఉండాలన్నదే టీడీపీ ఆశయమన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏడాదికి రూ.20 వేలు రైతులకు ఇస్తామన్న మహోన్నత నిర్ణయంతో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు.వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు బొండా జగన్ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన తొలి మేనిఫేస్టో ప్రజారంజకంగా ఉండడంతోప్రజలంతా ఎప్పుడు టీడీపీని గెలిపిద్దామా అని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, క్లస్టర్ ఇన్‌చార్జీలు ఆడారి ఆదిమూర్తి, బొద్దపు శ్రీనివాసరావు, టీడీపీ రాంబిల్లి మండల అధ్యక్షుడు దిన్‌బాబు, నేతలు కరణం రవి, గుర్రాల రాము, మజ్జి రాంబాబు పాల్గొన్నారు.