జీవో 1 ప్రతులు దహనం
ABN , First Publish Date - 2023-01-15T00:55:31+05:30 IST
రాష్ట్ర మంత్రులు తమ శాఖల పనులను విస్మరించి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

అనకాపల్లి అర్బన్, జనవరి 14 : రాష్ట్ర మంత్రులు తమ శాఖల పనులను విస్మరించి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జీవో నెంబర్ 1 ప్రతులను శనివారం ఉదయం అనకాపల్లిలోని పార్కు సెంటర్‌లో భోగి మంటలో వేసి దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తననే నమ్మాలని కొన్ని పత్రికలు, చానళ్ల పేర్లు చెప్పి వాటిని నమ్మవద్దని చెపుతుండడం హాస్యాస్పదమన్నారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడో ఒకప్పుడు జీతాలు చెల్లిస్తున్నాం అని చెప్పడం సిగ్గుచేటన్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడితే తప్పేంటని చెప్పడం అతని దోపిడీతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. నిత్యం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ పాలనను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టులపై అవగాహన లేకుండా కుల,మతాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారిశెట్టి శంకరరావు, పొలిమేర నాయుడు, బొడ్డేడ మురళీ, మళ్ళ గణేష్, కొణతాల బాల, బుద్ద భువనేశ్వరరావు, విల్లూరి రమణబాబు, పెంటకోట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ శ్రేణులతో కలిసి శనివారం ఉదయం వెన్నెలపాలెంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంట వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 1 ప్రతిని మంటలో వేసి దహనం చేరు. అనంతరం జగన్ పాలన తీరును ఎండగట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, నాయకులు పైలా వరలక్ష్మి, లోకిరెడ్డి అభిసన్యాసినాయుడు, గొంప మారునాయుడు, వాసిరెడ్డి ఈశ్వరరావు, మారునాయుడు, నాగేశ్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎలమంచిలి : పట్టణంలోని టీడీపీ ప్రాంతీయ కార్యాలయం వద్ద శనివారం ఉదయం భోగిమంటలో జీవో నంబర్ 1 ప్రతిని ఆ పార్టీ శ్రేణులు వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరారవు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేపడుతున్న జగన్‌ను జనం బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నాయకులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, కొఠారు సాంబ, రాజాన సూర్యనాగేశ్వరావు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణలతో పాటు ఆదిమూర్తి, బొద్దపు శ్రీను, నమ్మి రమణ, గొర్లె బాబూరావు, గుర్రాల రాము, కోటిబాబు, సుబ్బయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.