షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-01-18T00:01:08+05:30 IST

జిల్లాలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వం తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.

షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలి
జిల్లేడిపూడి సభలో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

నాతవరం, జనవరి 17: జిల్లాలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వం తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. మంగళవారం మండలంలోని జిల్లేడిపూడిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్ర చేసేటప్పుడు జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరించి చెరకు రైతులను ఆదుకుంటున్నానని హామీ ఇచ్చారని, నేడు షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడి చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తానని, ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని ఎన్నో హామీలు గుప్పించి వైసీపీ ప్రజలను మోసం చేసిందన్నారు. టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు ఇనపసప్పల సత్యవతి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అనంతరం జిల్లేడిపూడిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలు ఎ.ఇందిరాదేవి, కె.రమ్య, యామినిలకు అయ్యన్నపాత్రుడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు కరక సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కోండ్రు మరిడియ్య, మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేముడు, టీడీపీ నాయకులు లాలం అచ్చిరాజు, కూండ్రపు అప్పలనాయుడు, పైల సూరిబాబు, కోరుప్రోలు వెంకటేష్‌, సర్పంచ్‌ లాలం రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:01:10+05:30 IST