AP News: ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డిపై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2023-02-24T14:42:05+05:30 IST
విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాద్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) వీసీ (Vice Chancellor) ప్రసాద్ రెడ్డి (Prasad Reddy)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Pathrudu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ కోడ్ (MLC Code)ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్నారు. ప్రైవేట్ హోటల్‌లో సమావేశం నిర్వహించి.. ఓట్లు వేయకపోతే విద్యా సంస్థలు మూయిస్తామని వీసీ బెదిరించారని ఆరోపించారు. ఏయూని వైసీపీ కార్యాలయం (YCP Office)గా ప్రసాద్ రెడ్డి మార్చేశారని విమర్శించారు. వైసీపీ నేతల బర్త్ డే కేకులను వీసీ కట్ చేయ లేదా? అని ప్రశ్నించారు.
జీవీఎంసీ ఎన్నికల్లో (GVMC Elections) ఏయూ నుంచే ప్రసాద్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. వీసీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ (EC)కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు (Fake Votes) ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఏయూలో గంజాయి (Marijuana) దొరికితే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. యూనివర్శిటీలో జరిగే అక్రమాలపై మాట్లాడితే.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. ఇలా బెదిరింపు కాల్స్ చేయడానికి ఒక బ్యాచ్‌ను ఏర్పాటు చేశారని, అక్రమాలకు పాల్పడుతున్న వీసీ ప్రసాద్ రెడ్డిని రీ కాల్ చేయాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.