TNSF Chief: కొంపదీసి జే బ్రాండ్ మద్యం తాగావా? లేక సంజన కొంపలో ఉన్నావా?.. అంబటిపై ప్రణవ్ సెటైర్

ABN , First Publish Date - 2023-10-11T15:05:32+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TNSF Chief: కొంపదీసి జే బ్రాండ్ మద్యం తాగావా? లేక సంజన కొంపలో ఉన్నావా?.. అంబటిపై ప్రణవ్ సెటైర్

విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై (TDP Leader Lokesh) ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (TNSF Chief Pranav Gopal) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రణవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మా బాబుగారిని మీ సైకోలు కుట్ర పన్ని... అక్రమ కేసులు పెట్టారు.. జైలుకు పంపారు. న్యాయం కోసం.. జాతీయ స్థాయిలో మద్దతు కోసం మా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు (TDP Chief Chandrababu), లోకేష్ కుటుంబాలకు 5 కోట్ల ఆంధ్రులు రక్షణ కవచంగా ఉన్నారు. అయినా.. మీలాంటి సైకోలు, జోకర్స్ హాని తలపెట్టే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ గారు ఏపిలోనే ఉన్నారు... కొంపదీసి జే బ్రాండ్ మద్యం తాగేవా? ఏంటి?. లేదా సంజన కొంపలో గాని, సుకన్య ఇంటిలో ఉన్నావా?’’ అంటూ అంబటిపై ప్రణవ్ గోపాల్ సెటైర్లు విసిరారు.

Updated Date - 2023-10-11T15:08:34+05:30 IST