Visakha City : ‘టాస్క్ ఫోర్స్’ పరిధిలోకి విశాఖ సిటీ
ABN , First Publish Date - 2023-07-04T13:17:14+05:30 IST
ఇటీవల విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులతోపాటు మరో బిల్డర్ కిడ్నాప్ ఘటనలు విశాఖలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ పరిధిలోని అన్ని పోలీస్ కమిషనరేట్లను టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్ పరిధిలోకి తెస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది.

విశాఖ : ఇటీవల విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులతోపాటు మరో బిల్డర్ కిడ్నాప్ ఘటనలు విశాఖలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ పరిధిలోని అన్ని పోలీస్ కమిషనరేట్లను టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్ పరిధిలోకి తెస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకూ సిటీలో ఏ ప్రాంతంలోని కేసులను అక్కడే నమోదుచేసి దర్యాప్తు చేసేవారు. ఇకపై దర్యాప్తు అంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలోనే జరగనుంది.
విశాఖలో వైసీపీ ఎంపీ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు.
విశాఖలో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌నకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ అనే రియల్టర్‌తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. విశాఖలో 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులిద్దరూ కిడ్నాప్‌నకు గురయ్యారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖకి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. 2021 జూన్‌లో విజయవాడలో శ్రీనివాస్‌ని పోలీసులు ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రూ.3 కోట్లు శ్రీనివాస్ కాజేశాడు. వాటిలో రూ.60 లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు.