వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2023-10-20T00:30:49+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ‘పశ్చిమ’ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ గురువారం సాయంత్రం పిలకవానిపాలెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

‘పశ్చిమ’ ఎమ్మెల్యే పి.గణబాబు
చంద్రబాబు అరెస్టును
వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న నిరసనలు
మల్కాపురం, అక్టోబరు 19: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ‘పశ్చిమ’ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ గురువారం సాయంత్రం పిలకవానిపాలెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు ఎంతో విలువవైనదని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉంటూ ఓట్లన్నీ టీడీపీకే దక్కేలా చూడాలని సూచించారు. అనంతరం చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ విశాఖ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.శ్రీభరత్, 58వ వార్డు అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
పాత గాజువాకలో..
గాజువాక: వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సీఎం జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయని తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పాత గాజువాకలో చేపట్టిన రిలి నిరాహార దీక్షల శిబిరంలో గురువారం ఆయన బాబు కోసం నేను పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, కక్ష సాధింపు చర్యలతోనే వైసీపీ ప్రభుత్వం పాలన సాగుతోందని మండిపడ్డారు. దీంతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తుందని, ఇలాంటి పరిపాలన దేశంలో ఎప్పుడు, ఎక్కడా జరగలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో పూజలు
సింధియా: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్టూ టీఎన్‌టీయూసీ నాయకులు యారాడ బీచ్ వద్దనున్న దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ నాయకులు పి.నర్సింగ్, వి.హరి యాదవ్, మొల్లి శ్రీను, భులోక, రంజాన్ ప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.
87వ వార్డులో..
కూర్మన్నపాలెం: వైసీపీ పాలనలో అరాచకాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్ ధ్వజమెత్తారు. 87వ వార్డు పరిధిలోని కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం రాత్రి భవానీ భక్తులతో కలిసి బాబుతో నేను ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ దుర్గాదేవికి పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయరామరాజు, సత్తిబాబు, కళ్లేపల్లి శ్రీనివాసవర్మ, మూర్తి, దానయ్య, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
86వ వార్డులో..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ 86వ వార్డు ఇన్‌చార్జి నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో వుడానగర్‌లో బాబుతో నేను కరపత్రాలను ప్రదర్శించారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ప్రజలకు వివరించారు. నాయకులు ఎం.కనకరాజు, వి.శ్రీనివాస్, రమేశ్, జగదీశ్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.