సీహెచ్‌సీలో వైద్య పరికరాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-21T01:15:50+05:30 IST
స్థానిక సీహెచ్‌సీలో సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఎమ్మెల్యే యూవీ రమణ మూర్తిరాజు గురువారం ప్రారంభించారు.

ఎలమంచిలి, ఏప్రిల్ 20 : స్థానిక సీహెచ్‌సీలో సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ఎమ్మెల్యే యూవీ రమణ మూర్తిరాజు గురువారం ప్రారంభించారు. ఆలా్ట్రసౌండ్ స్కానర్, ఆర్ధోపెడిక్ విభాగం చెకింగ్ మిషన్, పలు ఆటోమేటిక్ వైద్య పరికరాలను రూ.16 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఆస్పత్రి వైద్య సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు సురేఖ, నిహారిక, మునిసి పల్ చైర్‌పర్సన్ రమాకుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ, ఎంపీపీ బోదెపు గోవింద్, మునిసిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, గుప్తా పాల్గొన్నారు.