Share News

బొబ్బిలి ఎమ్మెల్యేకి భారీ షాక్‌

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:17 AM

బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు రాజకీయంగా భారీ షాక్‌ తగిలింది. ఆయన ముఖ్య అనుచరులైన రామభద్రపురం మండలం సోంపురం సర్పంచ్‌ చొక్కాపు నారాయణమ్మ, కొత్తరేగ సర్పంచ్‌ కిలపర్తి మురళీ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు.

 బొబ్బిలి ఎమ్మెల్యేకి భారీ షాక్‌
టీడీపీలో చేరిన సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాలకు చెందిన కుటుంబాలు

- వందలాది కుటుంబాలు టీడీపీ చేరిక

- ఇద్దరు ముఖ్య అనుచరులు కూడా..

బొబ్బిలి/రామభద్రపురం, డిసెంబర్‌ 22: బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు రాజకీయంగా భారీ షాక్‌ తగిలింది. ఆయన ముఖ్య అనుచరులైన రామభద్రపురం మండలం సోంపురం సర్పంచ్‌ చొక్కాపు నారాయణమ్మ, కొత్తరేగ సర్పంచ్‌ కిలపర్తి మురళీ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు. వీరితో పాటు సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలు టీడీపీ తీర్థం పుచుకున్నాయి. బొబ్బిలి కోటలో వీరందరినీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కెకె రంగరావు (బేబీనాయన) సాదరంగా ఆహ్వా నించి పార్టీ కండువాలు కప్పారు. ఇప్పటికే రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఒకేరోజు ఇద్దరు వైసీపీ సర్పంచ్‌లు టీడీపీలో చేరడంతో మరింత బలం పెరిగింది. మరో నాలుగైదు గ్రామాలకు చెందిన అధికార పార్టీ సర్పంచ్‌లు కూడా వైసీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నట్టు భోగట్టా. వైసీపీ ప్రజా వ్యతిరేక విధా నాలపై విసుగుచెంది టీడీపీలో చేరినట్లు కొత్తరేగ సర్పంచ్‌ కిలపర్తి మురళీ విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమన్నారు. రాబోయే తెలుగుదేశం-జనసేన సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రా ష్ర్టానికి అన్నీ మంచి రోజులేనని అన్నారు. ఈ రోజు నుంచి బొబ్బిలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు ప్రారంభమయ్యా యన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే అన్నివర్గాల ప్రజలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మడక తిరుపతినాయుడు, రామభద్రపురం మండల పార్టీ అధ్యక్షుడు కరణం విజయ భాస్కరరావు, నాయకులు కోట అప్పలస్వామి, చింత రామ్మూర్తి, బొట్ట సురేష్‌కుమార్‌, సూరెడ్డి శ్రీనివాసరావు,బంకురు సీతంనాయుడు, పప్పల దాలినాయుడు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:17 AM