AP Volunteer: వలంటీరు ఘరానా మోసం!.. ఓ డ్వాక్రా మహిళకు నామినీగా తన భర్త పేరు పెట్టించి..

ABN , First Publish Date - 2023-08-30T03:05:51+05:30 IST

వలంటీర్‌ మోసం చేసి ఓ డ్వాక్రా మహిళ బీమా సొమ్మును చాలా తెలివిగా కాజేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు భర్తతో సంబంధం లేకపోవటంతో కనపర్తిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు.

AP Volunteer: వలంటీరు ఘరానా మోసం!.. ఓ డ్వాక్రా మహిళకు నామినీగా తన భర్త పేరు పెట్టించి..

డ్వాక్రా మహిళకు నామినీగా తన భర్త పేరు

మహిళ మృతితో వలంటీరు భర్త ఖాతాకు లక్ష సొమ్ము జమ

నాగులుప్పలపాడు, ఆగస్టు 29: వలంటీర్‌ మోసం చేసి ఓ డ్వాక్రా మహిళ బీమా సొమ్మును చాలా తెలివిగా కాజేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు భర్తతో సంబంధం లేకపోవటంతో కనపర్తిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. ఆమె కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని బీమా సర్వేలో గుర్తించిన వలంటీర్‌ కమ్‌ డ్వాక్రా గ్రూపు లీడర్‌ అయిన చాట్ల దివ్య.. తన భర్త కిశోర్‌ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా చేర్చాలని ఎత్తు వేసింది.


ఈమేరకు సచివాలయ ఉద్యోగి సహాయంతో తన భర్తను నామినీగా పేరు మార్చేశారు. ఆరోగ్యం బాగా లేని నాగేంద్రం కొంతకాలానికి మృతిచెందారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆమె డెత్‌ సర్టిఫికెట్‌ను వలంటీర్‌ దివ్య తీసుకుని మండల వెలుగు కార్యాలయానికి అదించింది. దీంతో వెంటనే బీమా సొమ్ము రూ.లక్ష కిశోర్‌ ఖాతాలో జమయ్యాయి. విషయం తెలుసుకున్న నాగేంద్రం సోదరుడు చాట్ల పుల్లయ్య.. వలంటీర్‌ చేసిన మోసంపై మంగళవారం ఎంపీడీఓ జయమణికి ఫిర్యాదు చేశారు. బీమా సొమ్మును తన తల్లి చాట్ల సమాధానంకు ఇప్పించాలని కోరారు. దివ్యతోపాటు, డిజిటల్‌ అసిస్టెంట్‌పైనా క్రిమినల్‌ కేసులు పెట్టి, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-30T11:15:04+05:30 IST