Bopparaju Venkateshwarlu: హక్కుల సాధనకు ఉద్యమం సాగిస్తాం: బొప్పరాజు
ABN , First Publish Date - 2023-04-15T21:08:24+05:30 IST
ఉద్యోగులు (Employees) కోరుతున్న న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధనకు పలు దశల్లో ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల..
భీమవరం: ఉద్యోగులు (Employees) కోరుతున్న న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధనకు పలు దశల్లో ఉద్యమం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) చెప్పారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆయన జేఏసీ నాయకులతో కలసి జిల్లాలో రిటైర్డ్, మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం శనివారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram), ఉండి నియోజకవర్గాల్లోని కాళ్ళ, కోపల్లె, విస్సాకోడేరు, భీమవరం ప్రాంతాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుని పాత సీపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యవేదికగా ఉద్యమం రెండు దశల్లో గత నెలలో ప్రారంభించామని, ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.