Ayyanna Patrudu: తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారులను రోడ్డు మీద నిలబెడతాం: అయ్యన్న
ABN , First Publish Date - 2023-04-17T20:22:13+05:30 IST
టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాటలు విని కేసులు పెట్టే పోలీసు అధికారులను రోడ్డు మీద నిలబెడతామని మాజీ మంత్రి
అమరావతి: టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాటలు విని కేసులు పెట్టే పోలీసు అధికారులను రోడ్డు మీద నిలబెడతామని మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) హెచ్చరించారు. కోడికత్తి, బాబాయి గొడ్డలి వేటుతో సానుభూతి ఓట్లు పొందిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) మరోసారి గెలిచేందుకు మరి ఇంకెన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతారోనన్నారు. తమ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధానితో రహస్యంగా ఏమి మాట్లాడారో, ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న పక్కా ఇళ్ళ నిర్మాణం తమ ఘనతగా చెప్పుకోవటం దారుణమన్నారు. రూ 3వేలు పెన్షన్ ఇస్తానని, ఒక్కొక్క పెన్షన్ దారులకు ఇప్పటి వరకు రూ 24,750 తక్కువ ఇచ్చి మోసం చేశారన్నారు. లిక్కర్, మద్యం అమ్మకాల్లో ఫోన్ పే, గూగుల్ పే (Phone Pay Google Pay) సౌకర్యం కల్పించక పోవటం, లిక్కర్ అమ్మకాల్లో అధిక శాతం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తుందని, తదనుగుణంగానే లిక్కర్ షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్లకు అనుమతించ లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు టీడీపీ (TDP) అధికారంలోకి రావాలని అయ్యన్న పిలుపునిచ్చారు.