AP News: ‘అధికారం ఏ ఒక్కరికీ సొంతం కాదు’
ABN , First Publish Date - 2023-01-04T19:34:14+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనను అడ్డుకోవడంపై టీడీపీ (TDP) కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనను అడ్డుకోవడంపై టీడీపీ (TDP) కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు వెళ్తే జగన్ రెడ్డి (Jagan Reddy) తన పోలీసుల చేత అడ్డుకోవటం, నాయకుడికి స్వాగతం పలకడానికి వెళ్లిన కార్యకర్తలపై లాఠీచార్జి చేయటానికి నిరసనగా కొయ్యలగూడెం మండలం, అంకాలగూడెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేసి, రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన రాజకీయ పార్టీల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ (YCP) ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 కాపీ ప్రతులను మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొరగం మాట్లాడుతూ జగన్ రెడ్డి ఈ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించటానికి విలులేదని, జీఓ నంబర్ 1 జారీ చేయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమెననీ, ప్రతిపక్ష నాయకుడు సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే అడ్డుకునే హక్కు నికు ఎక్కడిదనీ, స్వాగతం పలకడానికి వచ్చిన కార్యకర్తలపై పోలీసులతో లాఠీచార్జి చేయించటం హేయమైన చర్య అని జగన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకో... నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ప్రజా సమస్యల పైన పోరాడుతూనే ఉంటామన్నారు. నీ ఓటమి ఖరారు అయిందనీ త్వరలోనే నువ్వు జైలుకు కూడా వెళ్ళిపోతావన్నారు. జగన్ రెడ్డి పిరికిచర్యలు మానుకుని రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలని హితవుపలికారు.
అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పోలీసులు వైసీపీకి అడుగులకు మడుగులు ఒత్తుతూ గుండాల్లా ప్రవర్తిస్తున్నారో మీ అందరికీ తగిన రీతిలో మిపై చర్యలు ఉంటాయని, అధికారం ఏ ఒక్కరికీ సొంతం కాదు అనే విషయం తెలుసుకుని నిబంధనలకు లోబడి పనిచేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ రవీంద్రనాథ్, వేమా శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, టౌన్ పార్టీ సెక్రెటరీ ఉప్పాటి వెంకట్రావు, ఏకుల గడ్డియ్య, పడమటి రవి, శుక్లబోయిన సత్యనారయణ, బాలిన రాఘవ, బిసి సాధికారిక రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభాని, నియోజకవర్గం తెలుగుమహిళా ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి, మండల తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆకుల అరుణ, నీలం నాగేశ్వరరావు, నక్కా రవి, జి వీరభద్రం, తోంటా సుబ్రహ్మణ్యం, పూలపల్లి జోజీ, తెలుగుమహిళా కార్యదర్శి చెరుకూరి రమ్య, జగ్గు అన్నవరం, కర్త దుర్గారావు, ఎండి బాషా, బిసి సెల్ మండల అధ్యక్షులు గంగుల నాగు తదితరులు ఉన్నారు.