Boragam Srinivasulu: చంద్రబాబు పాలన వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు

ABN , First Publish Date - 2023-01-05T19:52:38+05:30 IST

సీఎం జగన్ రెడ్డి అసమర్థ పాలనపై టీడీపీ (TDP) పోరాడుతుందని, పన్నుల మోత మోగిస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్నాడని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు.

Boragam Srinivasulu: చంద్రబాబు పాలన వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు

ఏలూరు జిల్లా: సీఎం జగన్ రెడ్డి అసమర్థ పాలనపై టీడీపీ (TDP) పోరాడుతుందని, పన్నుల మోత మోగిస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్నాడని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు. రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ది లేదని, జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన వస్తేనే రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు బాగు పడతారని శ్రీనివాసులు తెలిపారు.

BORAGAM-15.jpg

'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న 15 అంశాలపై సమస్యలను బొరగం శ్రీనివాసులు అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి మద్దతుగా 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ప్రజలు సానుకూలంగా స్పందించి మిస్డ్ కాల్ ఇచ్చారని ఆయన చెప్పారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో జరిగిన 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మ రామ గంటలయ్య, ఎంపీటీసీ కాగితాల గణపతి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నబాబు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, తెలుగుయువత మండల అధ్యక్షులు శివంగి సుమంత్, కొడవటి నవీన్ కుమార్, కాకులపాటి రామకృష్ణ, ఐటీడీపీ గ్రామ కో ఆర్డినేటర్ విప్పే చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-05T19:54:53+05:30 IST