విశ్వ విఖ్యాత రాజకీయ సార్వభౌమ
ABN , First Publish Date - 2023-05-28T00:21:31+05:30 IST
ఆ ఒక్కరే.. ఇక్కడే పుట్టారు.. నందమూరి తారక రామారావు. తెలుగు వారు ముద్దుగా పిలుచుకునే పేర్లు అన్న గారు,

యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి నేడే
ఊరూవాడా వేడుకలకు సిద్ధం
మహానాడుకు భారీగా కదలిన జనం
ఎక్కడికక్కడ ప్రభుత్వ నిఘా
నూటికో కోటికో ఒకరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు.
ఆ ఒక్కరే.. ఇక్కడే పుట్టారు.. నందమూరి తారక రామారావు. తెలుగు వారు ముద్దుగా పిలుచుకునే పేర్లు అన్న గారు, ఎన్టీఆర్. పలకా బలపం పట్టనోళ్లకు ఎన్టీవోడు. ఆంధ్రుల అందాల ఆరాధ్యుడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. అలనాటి యుగపురుషుడు. నేడు ఆ మహనీయుని శత జయంతి. వందేళ్ల వేడుకలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. ఊరూ వాడా అన్న ఎన్టీఆర్‌ను స్మరిస్తూ ఇంటింటికీ తిరిగి మరీ
ఆయన స్ఫూర్తిని ఈతరం వారికి గుర్తు చేస్తోంది. శత జయంతి వేళ గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడుకు భారీ సంఖ్యలో అభిమాన శ్రేణులు పయనమయ్యాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ఎన్టీఆర్ సినీ జీవితంతో గోదారి జిల్లాలు ముడిపడే ఉన్నా యి. పాలకొల్లు, భీమవరం, పోలవరం ప్రాంతాల్లో జరిగిన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడేవారు. ప్రజలను ఉత్తేజ పరిచే విధంగా ఆయన నటించిన ‘విశ్వరూపం’ చిత్రం నరసా పురం ప్రాంతంలోనే షూటింగ్ జరిగింది. చివరి చిత్రం ‘శ్రీనాఽథ కవి సార్వభౌముడు’ చిత్రం షూటింగ్ పోలవరం, పట్టిసీమ ప్రాంతంలో రోజుల తరబడిసాగింది. అప్పటికే పార్టీ స్థాపించి సీఎం హోదాలోనూ కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత తను అతి మక్కువ చూపించే శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా తీశారు. ఎన్టీఆర్ అంటే పడి చచ్చే అభిమానులు ఉమ్మడి పశ్చి మలో కోకొల్లలు. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించిన తొలినాళ్లలో ఇక్కడ పర్యటించినప్పుడు రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. 1982లో కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్టీఆర్ ప్రచారాన్ని ముగిం చుకుని భీమవరానికి ఉదయం 11 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 12 గంటలు ఆలస్యంగా రాత్రి 11కు చేరుకున్నారు. మార్గమధ్యంలో జన గోదావరి కనిపించింది. మహిళలు ఎదు రేగి నీరాజనాలు పట్టేవారు. కుర్రకారు ఆనందానికి అవధులు ఉండేవికాదు. ఎన్టీఆర్ పార్టీ స్ఫూర్తిని రగిలిస్తే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. అనే పాట వినిపిస్తుండగా చైతన్యరఽథం అధిరోహించిన ఎన్టీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రతీ చోటా జనం ఆదరించారు, అభిమానించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాలకు గాను 14 చోట్ల బ్రహ్మరథం పట్టారు. పాలి ప్రసాద్, రాధాకృష్ణ వంటి వారు ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు నేతలుగా కొనసాగారు. ఆయన స్ఫూర్తిని ప్రతీ ఒక్కరిలోనూ రగిలిస్తూనే ఉన్నారు. పార్టీపరంగా 1985లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని విజయపతాక ఎగరేసింది. కాంగ్రెస్‌ను తుడిచిపారేసింది. ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వాన్న తెలుగుదండు ముందుకే సాగింది. శత జయంతి ఉత్సవాలు సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాలకు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుని మీ బాటలో నడుస్తామంటూ ప్రతినబూనారు.
మహానాడు.. సందడే సందడి
ఓ వైపు శతజయంతి ఉత్సవాలు సాగుతుండగానే మహా నాడు ఉత్సవాలు అందరినీ కదిలించాయి. ఎన్నడూలేని ఉత్సా హం నాయకులు, కార్యకర్తల్లో కనిపించింది. తణుకు నియోజక వర్గంలో ఆడపడుచులు ఊరూరా గడపగడపకు వెళ్లి పసుపు పండుగ వచ్చింది కదలిరండి.. అంటూ నుదుట కుంకుమ దిద్ది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తెలుగుదేశం మహానాడు అంటే ఆంధ్రుల పండుగగా అభివర్ణిస్తూ ఈ మేరకు ముందు కు సాగారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన ప్రతిని ధుల సభకు జిల్లా నుంచి వేలాదిగా హాజరయ్యారు. మహా నాడులో అటు పార్టీ సీనియర్లు, ఇంకోవైపు యువనేత నారా లోకేశ్‌తో సెల్ఫీలు దిగారు. సోషల్ మీడియాలో హోరెత్తించారు. రాజమహేంద్రవరంలో జరిగే మహానాడుకు ఆటంకాలు సృష్టి స్తున్నా ఎక్కడా వెరవలేదు.. బెదరలేదు. పోలవరం నియోజక వర్గంలోని మారుమూల గ్రామాల నుంచి ఆదివారం రాజమ హేంద్రవరం వెళ్లేందుకు కార్యకర్తలు సన్నాహాలు చేశారంటే టీడీపీ ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రత్యేకించి మహిళలు ప్రైవేటు వాహనాల్లో తరలి వెళ్లారు.
ఎక్కడికక్కడ నిఘా
మహానాడుకు ఏ నియోజకవర్గం నుంచి ఎందరు వెళుతు న్నారో ప్రభుత్వ నిఘా వర్గాలు ఆరా తీశాయి. మంత్రుల నియోజకవర్గాలైన కొవ్వూరు, తాడేపల్లిగూడెం, తణుకుతోపాటు ఆచంట, పాలకొల్లు, దెందులూరు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఎంత మేర మహానాడుకు వెళ్తుంది లెక్కలేస్తున్నారు. దీనిని ఖాతరు చేయకుండా ప్రతీ నియోజక వర్గం నుంచి అంచనాకు మించే కార్యకర్తలు, అభిమానులు మహానాడుకు తరలివెళుతున్నారు. ఆదివారం ఉదయాన్నే దారులన్నీ రాజమహేంద్రవరం వైపే కదిలాయి. అందుకనే ఉంగుటూరు, కలపర్రు టోల్‌గేట్ల వద్ద నిఘా వర్గాలు మోహరించాయి.
ఆ టెలిగ్రామ్‌ను మర్చిపోలేను
– మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనే వాడిని. నరసాపురం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉండగా.. నా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాకు టెలిగ్రామ్ పంపించారు. ‘అర్జంటుగా హైదరాబాద్ వచ్చి నన్ను కలుసుకో’ అదీ దీని సారాంశం. నేను అన్న గారిని కలిసేందుకు లోపలకు వెళుతుండగా దూరం నుంచి నన్ను చూసిన ఎన్టీఆర్.. ‘రా బ్రదర్’ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచారు. ‘మీ పనితీరును చూశా. మీలాంటి విద్యావంతులే మన పార్టీకి అవసరం. అందుకే మీ సేవలను మరింతగా వినియోగించుకోవాలని మిమ్మల్ని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్‌గా నియమిస్తున్నా’ అంటూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. నాకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటున్న నన్ను హైదరా బాద్‌కు పిలిపించి పార్టీ కార్యాలయ బాధ్యతలు అప్పగించడంతో పాటు రెండుసార్లు చైర్మన్‌గా, ఒకసారి ఎమ్మెల్సీగా, మరోసారి శాసనమండలి చైర్మన్‌గా నియమించారు.
– నరసాపురం
ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు పాలన నాదే
– మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య
ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనకూ నేనంటే ఎంతో నమ్మకం. ఎంత అంటే.. నాకు ఎంతో కీలకమైన హోం మంత్రి శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లినపుడు ప్రభుత్వాన్ని నా చేతిలో పెట్టారు. నమ్మకానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పోర్టు పోలియోలన్నీ నేనే చూసేవాడిని హోంతోపాటు సమాచార శాఖల మంత్రిగానూ పనిచేశాను. ఆయనపట్ల నా గురుభక్తిని చాటుకోవడానికి 2015లో ‘60 సంవత్సరాల నా రాజకీయ ప్రస్తానం’ పేరిట నేను రాసుకున్న జీవిత చరిత్రను ఆయనకే అంకితం ఇచ్చాను. ఇందులో రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులకు ‘సంక్షేమం, నీతివంతమైన పాలన, అడ్మినిస్ట్రేషన్’ అనే అంశాలపై మార్కులు ఇచ్చారు. అందులోనీతివంతమైన పాలన చేసిన వ ్యక్తిగా ఎన్‌టీఆర్‌కు 90 మార్కులు, సంక్షే మ పథకాల అమలులో 85 మార్కులు ఇచ్చాను. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్‌ను శత జయంతి వేళ ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.
– పాలకొల్లు