టీడీపీ పథకాలపై పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-06-22T02:00:35+05:30 IST

భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పలు పథకాలతో ముసునూరు మండల టీడీపీ నాయకులు ముద్రించిన పోస్టర్‌ను బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.

టీడీపీ పథకాలపై పోస్టర్‌ ఆవిష్కరణ
చంద్రబాబుతో పోస్టర్‌ను ఆవిష్కరింపజేస్తున్న తెలుగు తమ్ముళ్లు

ముసునూరు, జూన్‌ 21: భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో పలు పథకాలతో ముసునూరు మండల టీడీపీ నాయకులు ముద్రించిన పోస్టర్‌ను బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గద్దె రఘు బాబు, కాట్రేనిపాడు నాయకుడు రాపర్ల బాలకృష్ణ సంయుక్తంగా సుమారు 5 వేల పోస్టర్లను వేయించినట్టు వివరించారు. చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ ఆవిష్కరణ ఆనందంగా ఉందని, మండల వ్యాప్తంగా ఈ పోస్టర్లతో టీడీపీ హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-22T02:00:35+05:30 IST