టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
ABN , First Publish Date - 2023-04-07T00:54:03+05:30 IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. మండలంలోని చీపురుగూడెంలో గురువారం సాయంత్రం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైకో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈసారి టీడీపీ రాకపోతే అంతా సర్వనాశనం అవుతుందన్నారు.

14న నూజివీడులో చంద్రబాబు సభకు భారీగా తరలిరావాలి
జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు
చాట్రాయి, ఏప్రిల్ 6 : వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. మండలంలోని చీపురుగూడెంలో గురువారం సాయంత్రం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైకో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈసారి టీడీపీ రాకపోతే అంతా సర్వనాశనం అవుతుందన్నారు.14వ తేదీన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అధినేత చంద్రబాబు నూజివీడు వస్తున్నారని, బందరు, గుడివాడలను మించి నూజివీడు సభను సూపర్ సక్సెస్ చేయాలని కోరారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టగా జగన్ కేవలం రూ.950 కోట్లు ఖర్చు పెట్టాడని, చింతపూడి ఎత్తిపోతల పనులు 70 శాతం పూర్తి చేయగా మూలన పడేశాడని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో జగన్ అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అప్రమత్తతగా ఉండాలన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ పాలలో ఏపీ బిహార్ కన్నా అధ్వానంగా తయారైయిందని, ఎలాగైనా గెలవాలని పట్టభద్రుల్లో దొంగ ఓట్లు చేర్చినట్లు ఇప్పుడు ప్రతి బూత్‌లో 50 నుంచి 100 దొంగ ఓట్లు చేర్చారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడం కోసం పదవుల్లో ఉన్న నాయకులు వైదొలిగి కొత్తవారికి అవకాశం కల్పిద్దామన్నారు. తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్‌కి ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు వేణుగోపాలరావు, నాయకులు బొట్టు రామచంద్రరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు
12వ తేదీకి బదులు 14న నూజివీడులో పర్యటన
నూజివీడు, ఏప్రిల్ 6: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూజివీడు పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని, ఈనెల 12వ తేదీకి బదులుగా 14న ఆయన పర్యటించనున్నట్టు నియోజకవర్గ తెలు గుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. వాస్తవానికి ఈనెల 12వ తేదీన నూజివీడు నుంచి ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్య క్రమం మచిలీపట్నం నుంచి ప్రారంభమై గుడివాడ నియోజకవర్గం అనంతరం నూజివీడు నియోజకవర్గంలో సాగుతుందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఈనెల 14వ తేదీ నూజివీడు నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు.