Indigo deal: కమర్షియల్ ఏవియేషన్ రంగంలో ఇండిగో సరికొత్త రికార్డ్..

ABN , First Publish Date - 2023-06-19T22:26:49+05:30 IST

దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో (Indigo) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏకంగా 500 విమానాల కొనుగోలుకు విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో (Airbus) ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఇటివలే ఎయిరిండియా 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చి సంచలనం సృష్టించగా.. ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం రికార్డ్‌గా మారింది.

Indigo deal: కమర్షియల్ ఏవియేషన్ రంగంలో ఇండిగో సరికొత్త  రికార్డ్..

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో (Indigo) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏకంగా 500 విమానాల కొనుగోలుకు విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో (Airbus) ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఇటివలే ఎయిరిండియా 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చి సంచలనం సృష్టించగా.. ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం రికార్డ్‌గా మారింది. విమాన ప్రయాణాలు చేస్తున్నవారి సంఖ్య పెరగడం, దేశ జనాభాను దృష్టిలో మార్కెట్‌లో పోటీ పడేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని ఈ పరిణామాన్ని చూస్తే స్పష్టమవుతోంది.

ప్యారీస్ ఎయిర్ షోలో సోమవారం ఈ డీల్ జరిగింది. ఇండిగో బోర్డ్ ఆఫ్ చైర్మన్ వీ సుమంత్రన్, ఇండిగో సీఈవో పీటర్స్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గిల్లౌమె ఫారీ, ఎయిర్‌బస్ చీఫ్, కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియాన్‌ల సమక్షం సంతకాలు జరిగాయి. కాగా ఏకంగా 500 ఏ320 విమానాల ఆర్డర్ కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందమని, రికార్డ్ స్థాయి కొనుగోలు ఒప్పందమని ఎయిర్‌బస్ ప్రకటించింది. కాగా ఈ ఆర్డర్‌తో కలిపి ఇండిగో మొత్తం విమానాల సంఖ్య 1330కి చేరుతుంది. ఏ320 విమానాలు కలిగివున్న అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో నిలవనుందని ఎయిర్‌బస్ తెలిపింది.

Updated Date - 2023-06-19T22:26:49+05:30 IST