శ్రీ అట్లూరికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ABN , First Publish Date - 2023-08-27T01:27:02+05:30 IST
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ మరియు భారతీయ కమ్యూనిటీలోని వ్యాపార ప్రముఖులలో ఒకరైన శ్రీ అట్లూరి.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ (ISF) 2023లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ మరియు భారతీయ కమ్యూనిటీలోని వ్యాపార ప్రముఖులలో ఒకరైన శ్రీ అట్లూరి.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ (ISF) 2023లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. బీఎన్‌వై మెలన్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ క్వాలిటీ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ అట్లూరి.. ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన సీఎక్స్‌వో ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ అట్లూరి మాట్లాడుతూ.. స్టార్టప్‌లలో చాలా మంది ఒకే ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం చూస్తాం. కానీ వినూత్న ఆలోచనలు ఉండి, వాటిని కరెక్ట్‌గా ప్రదర్శించగలిగే నైపుణ్యం ఉంటే.. ఇక్కడ నిధుల సమస్య ఉండనే ఉండదు. కొత్త సాంకేతికత గురించి అలాగే మార్కెట్ పోకడలపై అవగాహన ఉంటే.. అభివృద్ధి అని ఆటోమేటిగ్గా జరుగుతుంది.. లేదంటే అంతా వెనకబడిపోతారని తెలిపారు. ఈ ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ (ISF) 2023లో నిర్వహించిన జూనికాన్స్ పోటీలో 14 నుండి 21 సంవత్సరాల వయస్సు గల 600 మంది ఔత్సాహిక మేధావులు పాల్గొనగా.. వారి నుంచి 10 అత్యుత్తమ ఆలోచనలు గుర్తించబడి, ప్రశంసించబడ్డాయి. వర్ధమాన వ్యాపారవేత్తలకు CXOలు మరియు పరిశ్రమల కెప్టెన్‌లతో నేరుగా సంభాషించడానికి, వారి విచారణలకు పరిష్కారాలను కనుగొనే అవకాశం కల్పించబడింది.