Guns and bullets: కారులో తుపాకులు, తూటాలు
ABN , First Publish Date - 2023-02-17T13:02:53+05:30 IST
తిరుప్పోరూరు వద్ద వాహనాల తనిఖీ సందర్భంగా కారులో తరలిస్తున్న రెండు తుపాకులు, తూటాలు(Guns and bullets), విదేశీ మద్యం సీసాలను తరలిస్తు

- తిరుప్పోరూరు వద్ద ముగ్గురి అరెస్టు
చెన్నై, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తిరుప్పోరూరు వద్ద వాహనాల తనిఖీ సందర్భంగా కారులో తరలిస్తున్న రెండు తుపాకులు, తూటాలు(Guns and bullets), విదేశీ మద్యం సీసాలను తరలిస్తున్న ముగ్గురు యువకులను సీఐ వెంకటేశన్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఇల్లూరు సమీపలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రెండుకార్లు ఆగకుండా వెళ్ళాయి. వెంటనే పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. కార్లలో ప్రయాణిస్తున్న ముట్టుకాడు ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్, బెంగళూరుకు చెందిన కార్తికేయన్, తిరుప్పోరూరుకు చెందిన వసంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్లు, తుపాకులు, తుటాలు, మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.