Husband: అమ్మ బాబోయ్.. ఇన్ని పెళ్లిళ్లా..? నీతో భరించలేం అంటూ 11 మంది భార్యలు వదిలేసి వెళ్లిపోతే..

ABN , First Publish Date - 2023-04-04T18:13:50+05:30 IST

ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 11 మంది మాత్రం నీతో భరించలేం బాబోయ్ అంటూ వదిలేసి పోతే.. పన్నెండో ఆమె చక్కగా కాపురం చేసుకుంటుంది. అదే అతగాడికి

Husband: అమ్మ బాబోయ్.. ఇన్ని పెళ్లిళ్లా..? నీతో భరించలేం అంటూ 11 మంది భార్యలు వదిలేసి వెళ్లిపోతే..
Husband

అతడో తాగుబోతు. ఎప్పుడూ మత్తులో ఉంటాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 11 మంది మాత్రం నీతో భరించలేం బాబోయ్ అంటూ వదిలేసి పోతే.. పన్నెండో ఆమె చక్కగా కాపురం చేసుకుంటుంది. అదే అతగాడికి నచ్చలేదు. రాత్రికి రాత్రే ఆమెతో గొడవ పెట్టుకుని చంపేశాడు. అసలు ఇంతకీ ఏమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఝార్ఖండ్‌(Jharkhand) లోని గయాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తారాపుర్‌ గ్రామానికి చెందిన రామచంద్ర (Husband), సావిత్రీదేవి భార్యభర్తలు. ఆమె.. అతడికి 12వ భార్య. ఆదివారం రాత్రి రామచంద్ర ఇంట్లో మద్యం సేవించాడు. అదే సమయంలో భార్య (wife) సావిత్రీదేవితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న రామచంద్ర.. భార్యపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.

నిందితుడు రామచంద్ర ఇప్పటి వరకూ పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సావిత్రీదేవి 12వ భార్య. ఈమెకు ఇది వరకే పెళ్లైంది. మిగతా 11 మంది భార్యలు.. రామచంద్రతో గొడవ పెట్టుకుని అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ పదకొండు మంది భార్యలతో రామచంద్రకు పిల్లలు కలగలేదు. సావిత్రీదేవికి మాత్రం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు అని గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: మెట్రో రైల్లో మరో షాకింగ్ సీన్.. ఓ మహిళతో గొడవ పడుతూనే కంగారుగా బ్యాగులో ఏదో వెతుకుతున్న యువతి.. చివరకు..!

ఇది కూడా చదవండి: Marriage Gift Kills Groom: పెళ్లికి వచ్చిన బహుమతే.. ఆ వరుడి ప్రాణాలను తీసేసింది.. పెళ్లయిన రెండ్రోజుల తర్వాత గిఫ్టులను బయటకు తీసి..

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-04T18:17:53+05:30 IST