Medical College Funds: నిధులపై సర్కారు పెత్తనం! ఇలాగైతే కష్టమంటున్న ప్రిన్సిపాళ్లు

ABN , First Publish Date - 2023-03-07T12:39:11+05:30 IST

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల (Medical College) నిర్వహణకు ప్రభుత్వం పైసా కూడా బడ్జెట్‌ ఇవ్వదు. మెడికల్‌ కాలేజీల నిధులపై మాత్రం ప్రభుత్వ (YCP Government) పెత్తనం ఎక్కువైంది. దీంతో మెడికల్‌

Medical College Funds: నిధులపై సర్కారు పెత్తనం! ఇలాగైతే కష్టమంటున్న ప్రిన్సిపాళ్లు
ఇలాగైతే కష్టమంటున్న ప్రిన్సిపాళ్లు

డీఎంఈ కనుసన్నల్లో కాలేజీ డెవల్‌పమెంట్‌ సొసైటీలు

ఏ పరికరం కొనాలన్నా అనుమతి తప్పనిసరి

ప్రతి ఫైలూ పంపాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశం

ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో కొనుగోళ్లకు జాప్యం

3 నెలల క్రితం ఫైల్‌ పంపినా ఇంకా పెండింగ్‌

ఒక్కో మైక్రోస్కో్‌పపై 10 మంది విద్యార్థులకు బోధన

ఇలాగైతే కాలేజీల నిర్వహణ కష్టమంటున్న ప్రిన్సిపాళ్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల (Medical College) నిర్వహణకు ప్రభుత్వం పైసా కూడా బడ్జెట్‌ ఇవ్వదు. మెడికల్‌ కాలేజీల నిధులపై మాత్రం ప్రభుత్వ (YCP Government) పెత్తనం ఎక్కువైంది. దీంతో మెడికల్‌ విద్యార్థులకు అవసరమైన చిన్న పరికరాలు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. అన్ని కాలేజీలకూ కాలేజీ డెవల్‌పమెంట్‌ సొసైటీ (సీడీఎస్)లు ఉన్నాయి. వీటికి డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) చైర్మన్‌గా ఉంటారు. సొసైటీల్లో కాలేజీల ప్రిన్సిపాళ్లతో పాటు మరికొంతమంది సభ్యులుగా ఉంటారు. గతంలో ప్రతి కాలేజీలో ఎప్పటికప్పుడు సీడీఎస్‌ సమావేశాలు జరిగేవి. కాలేజీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి పరికరాలు కొనుగోలు చేయాలి? వంటి అంశాలను ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఆ వెంటనే అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేవారు. సీడీఎస్‌ చైర్మన్‌గా ఉన్న డీఎంఈకి సమాచారం ఇచ్చేవారు. డీఎంఈ ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రిన్సిపాళ్ల నిర్ణయాలకు ఆమోదం తెలిపేవారు. కాలేజీల్లో సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు (Medical College Funds). ప్రభుత్వం కొత్తగా ఐఏఎ్‌సను డీఎంఈగా నియమించడంతో పరిస్థితి మారిపోయింది.

ఆయన సీడీఎ్‌సల నిధులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఏయే కాలేజీల్లో ఎంతెంత నిధులున్నాయి? ఎలా ఖర్చు పెడుతున్నారు? నిధులు ఖాతాల్లో ఎందుకు ఉంచుతున్నారు? వంటి విషయాలను ఆరా తీయడం ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా చిన్న గుండు సూది కొనుగోలు చేయాలన్న తన అనుమతి తీసుకోవాలని కొత్త నిబంధనలు పెట్టారు. దీంతో ప్రిన్సిపాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్‌ కాలేజీల్లో సీడీఎ్‌సతో పాటు కొనుగోలు కమిటీ ఉంటుంది. విద్యార్థులకు అవసరమైన వస్తువులు కావాలంటే కొనుగోలు కమిటీ ఆమోదించి, ఆ తర్వాత సీడీఎస్‌ ఆమోదం కోరేది. సీడీఎ్‌సలకు చైర్మన్‌గా ఉన్న డీఎంఈ ఎప్పుడూ అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపేవారు. అయితే కొత్త డీఎంఈ... కొనుగోలు కమిటీ ఆమోదంతో సంబంధం లేకుండా ఏ పరికరం కొనాలన్నా తన అనుమతి తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రిన్సిపాళ్లు డీఎంఈకి లేఖలు రాస్తున్నా.. అనుమతులు రావడం లేదు.

3 నెలలయినా అనుమతి లేదు

ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో (Andhra Medical College) విద్యార్థులు పాతపడిన మైక్రోస్కో్‌పలు వాడుతున్నారు. అవి అంతగా పని చేయడం లేదు. పది మంది విద్యార్థులు కలిపి ఒక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో మూడు నెలల క్రితం మైక్రోస్కో్‌పలు కొనుగోలు చేయాలని ప్రిన్సిపల్‌ నిర్ణయించారు. మెడికల్‌ టీచింగ్‌కు అత్యాధునిక మైక్రోస్కో్‌పలు అందుబాటులోకి వచ్చాయి. 250 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, మరికొంత మంది పీజీ విద్యార్థులకు మొత్తం 300 మైక్రోస్కో్‌పల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని డీఎంఈకి ప్రిన్సిపాల్‌ లేఖ రాశారు. ఆ ఫైల్‌ విషయంలో ఇప్పటి వరకూ అతీగతి లేదు. మూడు నెలలు అయినా డీఎంఈ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫైల్‌ను రెండు, మూడుసార్లు కిందకు పంపించారు. దీంతో ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో పాత పరికరాలతోనే కాలం గడిపేస్తున్నారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ అధికారులు అడిగిన వైద్య పరికరాల విషయంలోనూ ఇలాగే జరిగింది.

అనుమతులు లభిస్తాయా..?

ఆంధ్రా, గుంటూరు మెడికల్‌ కాలేజీలకు అనుమతి విషయంలో జరిగిన జాప్యంతో మిగిలిన మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. గుండుసూది కొనుగోలు చేయడానికి కూడా డీఎంఈ అనుమతి కావాలంటే కాలేజీల నిర్వహణ కష్టమవుతుందన్న భావనలో ఉన్నారు. కాలేజీ నిర్వహణ విషయంలో అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి కూడా డీఎంఈ అనుమతి కావాలంటే కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డీఎంఈ లాగిన్‌లో వందల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ ఒక్కరే కావడంతో పరిపాలన ఇబ్బందిగా మారింది. డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ ఈ-ఆఫీ్‌సలో ఆరు వందల వరకూ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు అక్కడి అధికారులే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీల ఫైళ్లన్నింటినీ డీఎంఈకి పంపించి, అనుమతి తీసుకోవడం గగనమే అవుతుంది. కాబట్టి కొంత మొత్తం వరకూ కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాలేజీ అధికారులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..

Updated Date - 2023-03-07T12:39:17+05:30 IST