5 Herbs That Are Effective: మధుమేహం, రక్తపోటు దెబ్బకు పారిపోతాయి.. ఓసారి ట్రైయ్ చేయండి.

ABN , First Publish Date - 2023-03-22T14:08:10+05:30 IST

జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు లేకపోవడం అనేది వ్యాధులకు కారణం అవుతుంది.

5 Herbs That Are Effective: మధుమేహం, రక్తపోటు దెబ్బకు పారిపోతాయి.. ఓసారి ట్రైయ్ చేయండి.
Common Medicinal Herbs

జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు లేకపోవడం అనేది వ్యాధులకు కారణం అవుతుంది. తద్వారా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటివి జీవనశైలిలో వదిలించుకోలేని రుగ్మతలుగా మొదలవుతాయి. ఈ రెండింటికీ సరిగా చికిత్స చేయలేకపోతే స్ట్రోక్, బలహీనమైన కంటి చూపు, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, రక్తప్రసరణ సరిగాలేక గుండె వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు ఆరోగ్య సమస్యలను నయంచేయడంలోనూ నియంత్రణలో ఉంచడంలోనూ ఔషదాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటితో పాటు మనం మామూలుగా ఉపయోగించే కొన్ని మూలికలు కూడా ఈ మధుమేహం, రక్తపోటు రెండింటినీ అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి.

ఆ మూలుకలు ఏవంటే..

తులసి...

తులసి మన రోజువారి జీవితంలో భాగమైన పవిత్రమైన మొక్క. దీనితో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా గుణాలను పొందవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంచడంలోనూ తులసి ప్రధానంగా పనిచేస్తుంది. తులసిలో ఉండే యూజీనాల్ రక్తపోటు పెంచే రసాయనాలను అడ్డుకుంటుంది. దీనికి తులసి ఆకులను నమలవచ్చు లేదా ఈ ఆకులతో టీని తయారుచేసి తీసుకోవచ్చు.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క సాధారణంగా అందరి ఇళ్ళల్లోనూ వాడే మసాలా దినుసు. మన మసాలా కూరలలో దాల్చిన చెక్క లేకుండా ఉండదు. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. దాని లక్షణాల కారణంగా దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: పిల్లాడు బొద్దుగా ఉన్నాడని మురిసిపోకండి.. అది ఊబకాయం కావచ్చు.

మెంతికూర..

మెంతికూర మధుమేహ వ్యాధికి ఉపయోగపడుతుందని అనేక పరిశోధనలు తెలిపాయి. పది గ్రాములు నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

పసుపు..

పసుపు కూడా మన ప్రతి వంటలోనూ, సాంప్రదాయాలలోనూ వాడుతూనే ఉంటాం. అలాంటి పసుపు ముఖ్యంగా కోవిడ్ 19 సమయంలో మన వంటల్లో పదిరెట్లు వాడబడింది. పసుపులో సహజంగా ఉండే కర్కుమిన్ అనే రసాయనం మధుమేహం చికిత్సకు సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. దీనిని రోజువారి ఆహారంలో చేర్చడం చాలా సులువు. పసుపు అస్సలు అలవాటు లేనివారు దీనిని వాడి మంచి ఫలితాలను పొందవచ్చు.

వెల్లుల్లి..

వెల్లుల్లి వంటకు మంచి రుచిని తీసుకురావడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైజ్ స్థాయిలను పెంచడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. రక్తప్రసరణ కూడా సవ్వంగా సాగుతుంది

Updated Date - 2023-03-22T14:08:10+05:30 IST

News Hub