PAN-Aadhaar: ఆధార్‌తో అనుసంధానం... 11.5 కోట్ల పాన్ కార్డులు ఢమాల్
ABN , First Publish Date - 2023-11-10T15:21:33+05:30 IST
నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డులు అనుసంధానించని కారణంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ ) కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్డీఐ దరఖాస్తుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
న్యూఢిల్లీ: నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డులు (Aadhaar cards) అనుసంధానించని కారణంగా 11.5 కోట్ల పాన్ కార్డులు (PAN cards) డీయాక్టివ్ (deactive) అయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ (RTI) కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్డీఐ దరఖాస్తుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఆధార్‌తో పాన్ అనుసంధానం గడువు ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ముగిసింది.
దేశంలో 70.24 కోట్ల పాన్ కార్డ్ హోల్డర్లు ఉండగా, వీరిలో 57.25 కోట్ల మంది ఆధార్‌తో పాన్ కార్డులు అనుసంధానం చేసుకున్నారు. 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ చేయలేదు. వీటిలో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. పాన్ కార్డ్ కొత్త దరఖాస్తుదారుల ఆధార్-పాన్ అనుసంధానం అప్లికేషన్ స్టేజ్‌లోనే ఆటోమేటిక్‌గా లింక్ అవుతాయి. ఆదాయం పన్ను చట్టం 139ఎఎలోని సబ్ సెక్షన్ (2) ప్రకారం 2017 జూలై 1కి ముందు, ఆ తర్వాత పాన్ కార్డులు తీసుకున్న వారికి పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరని ఆర్టీఐ సమాధానంలో సీబీడీటీ తెలిపింది. సెక్షన్ 234హెచ్ ప్రకారం, ఆధార్-పాన్ అనుసంధానం గడువులోగా చేయని వ్య్యక్తులు పాన్ రీయాక్టివ్ చేసుకునేందుకు రూ.1,000 జరిమానా (penalty) చెల్లించాల్సి ఉంటుంది. తొలుత మార్చి 30 వరకూ అనుసంధానానికి కేంద్ర అవకాశం ఇవ్వగా, చివరి అవకాశంగా జూన్ 30 వరకూ గడువు ఇచ్చింది. ఎవరైతే జూన్ 30 గడువును మిస్ అయ్యరో, వారు ఫెనాల్టీ చెల్చించి తమ పాన్ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. పాన్ కార్డు పునురద్ధరించడానికి 30 రోజుల సమయం పడుతుంది.