Apple Store : భారత్‌లో ఆపిల్ తొలి స్టోర్.. మోదీతో టిమ్ కుక్ భేటీ త్వరలో?..
ABN , First Publish Date - 2023-04-11T17:19:42+05:30 IST
ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీ మన దేశంలో ఏర్పాటు చేసే తొలి స్టోర్స్ వచ్చే వారం ప్రారంభం కాబోతోంది. మన దేశ మార్కెట్, తయారీ రంగంపై
న్యూఢిల్లీ : ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీ మన దేశంలో ఏర్పాటు చేసే తొలి స్టోర్స్ వచ్చే వారం ప్రారంభం కాబోతోంది. మన దేశ మార్కెట్, తయారీ రంగంపై ఈ కంపెనీకి ఉన్న నమ్మకం, ఆకాంక్షలు దీని ద్వారా వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ (Apple Inc. Chief Executive Officer Tim Cook) భారత దేశంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా చెప్తోంది.
ఆపిల్ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో, ఏప్రిల్ 18న ముంబైలోనూ, ఏప్రిల్ 20న న్యూఢిల్లీలోనూ ఔట్‌లెట్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఈ రెండు స్టోర్స్‌ను ప్రారంభించడానికి టిమ్ కుక్ భారత దేశానికి వస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కుక్ 2016లో మన దేశంలో పర్యటించారు. ప్రస్తుతం మన దేశంలో ఐఫోన్ల అమ్మకాలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. మరోవైపు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఐఫోన్ల విలువ బిలియన్ల డాలర్లలో ఉంది. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో కుక్ మన దేశానికి మరోసారి రాబోతున్నారు.
అమెరికా-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనా నుంచి ఇతర దేశాలకు అసెంబ్లీ ఆపరేషన్స్ నిర్వహించాలని ఆపిల్ కంపెనీ నిర్ణయించింది. మన దేశంలో తొలి ఆపిల్ స్టోర్స్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తోంది. న్యూఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న అత్యంత ప్రముఖ మాల్‌లో రెండో సోర్ట్స్‌ను ప్రారంభిస్తోంది.
ఆపిల్ తొలి ఇండియన్ ఆన్‌లైన్ స్టోర్ 2020లో ప్రారంభమైంది. భారత దేశం ప్రపంచంలో రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, అంతేకాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ కూడా.
ఇవి కూడా చదవండి :
Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్
BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం